
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో’ భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. జూన్ 4 నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను, జూన్ 6 నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని, జూన్ 9మంచిర్యాల జిల్లా, జూన్ 12 గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఇప్పటికే 18 జిల్లాల్లో కాంప్లేక్స్ లను, సీఎం కేసీఆర్ ప్రారంభించగా, కొన్ని కాంప్లెక్స్ లు నిర్మాణ దశలో ఉన్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మంచిర్యాల జిల్లా పర్యటన షెడ్యూల్:-
●జూన్ 9 న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి గారు.
●మంచిర్యాల IDOC కలెక్టరేట్ ప్రారంభోత్సవం.
●మంచిర్యాల – అంతర్గం గోదావరి బ్రిడ్జి శంకుస్థాపన
●మందమర్రి లో Rs 500 కోట్లతో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన
●మంచిర్యాల మెడికల్ కాలేజ్ శాశ్వత క్యాంపస్ , నర్సింగ్ కాలేజ్ శంకుస్థాపన
●Rs 1648 కోట్లతో చెన్నూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ శంకుస్థాపన
●నస్పూర్ లోని BRS జిల్లా పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం.