ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్ళిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బృందం డాలియన్ నగరం నుండి బయలుదేరి వెళ్లి నేడు షాంఘై చేరుకుంది. న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించనున్నారు. పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులతో సీఎం కేసీఆర్ ఈరోజు సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరిస్తారు.