mt_logo

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

ప్రగతి భవన్ లో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర పాల్గొన్నారు. సీఎంతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముందుగా సీఎం కేసీఆర్ గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్న సైనిక అమర వీరుల స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, ప్రజలే పరిపాలించుకునే సమాఖ్య స్ఫూర్తితో, దృఢ, అదృఢమైన విశిష్టమైన రాజ్యాంగం మనదని అన్నారు. సీఎం కెసిఆర్ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా, సమాఖ్య స్ఫూర్తిని చాటుతూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేశారని, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపి గుణాత్మక ప్రగతిని సాధించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *