mt_logo

కాళేశ్వర విజయ పరంపర & కన్నీటి గాధ వెళ్లబుచ్చిన సీఎం కేసీఆర్ 

కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని 11 వ శతాబ్ధంలోనే 75 వేల గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటం వల్ల 35 వేల చెరువులు మాయం అయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్  మన మధ్య లేరు. జయశంకర్ గురించి గొప్ప విషయం చెప్పాలి. ఎంతోమంది ఉద్యమంలోకి వచ్చారు ..పోయారు. చచ్చిపోయే వరకు తెలంగాణ కోసం పోరాడారు. ఎక్కడా రాజీ పడలేదు. స్కూల్ స్థాయిలోనే  పిడికిలెత్తి చనిపోయే వరకు దించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో  ప్రతి సంవత్సరం తెలంగాణకు కేటాయించే  బడ్జెట్ లు అధ్యయనం చేశారు. కేసీఆర్ లాంటి అతను రాకపోతాడా అని ఎదురు చూశానని చెప్పారు. దానికోసం బడ్జెట్ రూపొందించేవాడినని అన్నారు.

తెలంగాణ వస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నది చాలా చర్చించాం. చెరువులు ముందుగా బాగు చేసుకోవాలని నిర్ణయించాం. కాకతీయుల పేరు మీద మిషన్ కాకతీయ అని తెలంగాణ ఆవిర్భావానికి ఐదు నెలల ముందే పేరు పెట్టాం. సర్కారుకు రూపాయి ఖర్చు లేకుండా చేశాం 35 లక్షల బోర్లు నీళ్లు పోస్తున్నాయి మిషన్ కాకతీయ పుణ్యమే అన్నారు.  కాళేశ్వరం మీద ఏడుపు దేనికి. తుంగతుర్తిలో కాళేశ్వరం నీళ్లు లేవా. అదే లేకపోతే నీళ్లు ఎక్కడివి . గుత్పకాద రాయిపాతి గుండుకొట్టి పోయిండు అని నేను పాట కూడా  రాసినా.. అన్ని నియోజకవర్గాలకు నీళ్లు పారిస్తున్నది  కాళేశ్వరమే. మెదక్ లో కొండపోచమ్మ, మల్లన్న  సాగర్ వంటి ప్రాజెక్టుల్లో నీళ్లు ఎక్కడివి. చంద్రబాబు ఉన్నప్పుడు కురవి దగ్గర నీళ్లు విడిస్తే అలాగే వెనకకు పోయాయి.

గర్భిణీలా కాకతీయ కాలువ 

కరీంనగర్ జిల్లాలో అద్భుతమైన నాలుగు జలధారలు, వరద కాలువలు , కాకతీయ కాలువ నిండు గర్భిణీలా ఉంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ నుంచి వెళ్లి వస్తుంటే సముద్రంలా నీళ్లు . మోటార్ పెట్టకుండా నీళ్లు ఎగబాకుతున్నాయి. సీతమ్మ సాగర్ 35 టీఎంసీలు, సమ్మక్క సారక్క ప్రాజెక్టు 8 టీఎంసీలు, 250 కిలోమీటర్ల గోదావరి నదిని 100 టీఎంసీల వాటర్ ఉన్నది. ఇవన్నీ కాళేశ్వరం జలాలేకదా? అని అడిగారు. 

పిచ్చిమేధావి ఒకడు ఉన్నడు ఈకలేదు తోక తెలువదు. మన ప్రాంతం వాడు కాదు. కాళేశ్వరం వేస్ట్ ఉన్నాడు. గోదావరి, కృష్ణా నది 100 మీటర్ల లోతు ఉంటది. హైదరాబాద్ 535 మీటర్లు ఎత్తు ఉంటది. ఇది గమనించి 75 వేల చెరువులు కట్టారు.  ఎగువ ప్రాంతంలో ఉన్న నీళ్లు కిందకు జారి చెరువుల్లో నిండాలన్నదే వారి ఆలోచన. అల్టిమేటం గా దక్షిణ తెలంగాణను కూడా కాపాడేది కూడా కాళేశ్వరం. గండిపేట నుంచి గ్రావిటీతో వస్తది. వట్టెం, ఏదుల రిజర్వాయర్లు నింపబోతున్నాం. బెస్ట్ రి హాబిటేషన్ కాలనీలు కట్టింది తెలంగాణ ప్రభుత్వమని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ శెభాష్ అన్నది. కాంగ్రెస్, టీడీపీ కాలంలో గెలుకుడు, పెట్టుడు అంతేకానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. మా ప్రభుత్వం చేసింది.

4 వేల కోట్ల రూపాయలతో అన్ని జిల్లాలో చెక్ డ్యాంలు

పాకాల ఆయకట్టుకు ఢోకా లేదు.  ఏం చేయనోడు పెద్ద మనిషి. చేస్తే కమీషన్ అంటారు. కాకతీయ రాజులు ఇచ్చిన చెరువులే ముఖ్యం . భూగర్భ జల వనరులు పెరుగుతాయి. చెక్ డ్యాంలు ఎన్నో కట్టాం. పెద్దవాగు అని ఉంటుంది. 30 చెక్ డ్యాంలు దేవరకద్ర లో కట్టారు. ఇలా 4 వేల కోట్ల రూపాయలతో అన్ని జిల్లాలో చెక్ డ్యాంలు కట్టారు. చెక్ డ్యాంల వల్ల పంట కొట్టుకుపోతే రైతులను కాపాడుకుంటాం. 

 పంట నష్టానికి 10 వేలు 

బండి పోతే బండి ఇస్తం. గుండుపోతే గుండు ఇస్తం అన్నడో పత్తాలేడు.  పంట నష్టానికి 10 వేలు ఇచ్చాం. మండుటెండల్లో కూడా చెరువులన్నీ నిండుగా కనబడుతున్నాయి. చెక్ డ్యాంలు అడుగులు పడుతున్నాయి. మీరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం బాగుపడింది లక్ష్మీ పుత్రుడు అని పేరు అందుకే పెట్టుకున్నామని స్పీకర్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అన్నారు. మీ స్ఫూర్తిని నిరంజన్ రెడ్డి కొనసాగిస్తున్నాడని అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో  7 లక్షల  యూరియా వాడితే ఇప్పుడు 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతున్నారు. తింటామంటే కాంగ్రెస్ వారికి పంపిస్తాం.

ఎరువులకు కొరత లేదు. కాంగ్రెస్ పాలనలో చెప్పుల లైన్లు.. కాంగ్రెస్ వస్తే కరెంట్ గోల్ మాల్, రైతుబంధుకు రాంరాం. దళిత బంధుకు జై భీమ్ అన్నారు. కాళేశ్వరం కడుతుంటే  ఎన్ని కేసులు అధ్యక్షా.. చనిపోయిన వారి  పేర్లు పెట్టి కేసులు వేసిండ్రు. ఖమ్మంలో చేపట్టిన సీతారామ. పాలమూరు లాంటి అనేక ప్రాజెక్టులు అతి త్వరలో పూర్తి చేస్తాం అన్నారు. మేమే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ప్రజలు మనల్నే గెలిపిస్తారు. దేశంలో తెలంగాణ తలమానికం అనే దాకా విశ్రమించం. ముందుకు వెళ్తాం అని అన్నారు.