mt_logo

కాంగ్రెస్ నాయకులు చేత కానీ దద్దమ్మలు: సీఎం కేసీఆర్

రామగుండం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ .. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఆగమాగం కావొద్దని తెలిపారు. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి. 3 తారీఖు నాడు లెక్కబెడుతరు. ఆడితో దుకాణం క్లోజ్ అవుతుందని మీరు అనుకుంటున్నరు. కానీ దుకాణం క్లోజ్ కాదు.. అప్పుడే దుకాణం సురువవుతదని పేర్కొన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తడో అక్కడ అదే గవర్నమెంట్ వస్తదని తెలిపారు. 

ప్రజాస్వామ్యంలో మీ దగ్గర ఉండే ఒకే ఒక బలమైన ఆయుధం మీ సొంత ఓటు. అది సద్వినియోగ పరిస్తే మంచి ప్రభుత్వం వస్తది. మంచి జరుగుతుందన్నారు.  ఆగమాగమయి ఎవరో చెప్పిండ్రని ఓటేస్తే, విచక్షణా రహితంగా ఓటేస్తే గోల్ మాల్ అయే పరిస్థితి ఉంటదని హెచ్చరించారు. ఎందుకంటే రాబోయే వచ్చే ఐదు సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తు, రామగుండం, గోదావరిఖని భవిష్యత్తు, మీ భవిష్యత్తును రాస్తది మీ ఓటు అని సూచించారు. 

సింగరేణిని ముంచిందెవరు? ఉన్న తెలంగాణను ముంచిందెవరు అని ప్రశ్నించారు. సింగరేణి 134 ఏండ్ల కాలంలో పుట్టిన మన సొంత ఆస్తి. ఈ కాంగ్రెస్ దద్దమ్మ నాయకులు చేతగాక సమైక్య నాయకుల చేతిలో పెడితే వాళ్లు కేంద్రం దగ్గర అప్పులు తెచ్చిండ్రు. 600 కోట్ల మారటోరియం ఉండే సింగరేణి మీద.అప్పులు తెచ్చి కట్టడం చేతగాక .. కేంద్రప్రభుత్వానికి 49 శాతం వాటా పుట్టించిండ్రు. మన సింగరేణి నూరు శాతం మనకే ఉంటుండే. అట్ల లేకుండా చేసిందే కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.