mt_logo

తెలంగాణ రాష్ట్రం ఇండియాలో అన్నింట్లో నంబర్‌వన్ కావాలనే కమిట్మెంట్‌తో పనిచేస్తున్న: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఇండియాలో అన్నింట్లో నంబర్‌వన్ కావాలనే కమిట్మెంట్‌తో పనిచేస్తున్నఅని సీఎం కేసీఆర్ తెలిపారు. పరిగి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు వేస్ట్ అంటడు. పీసీసీ అధ్యక్షుడు రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నడు. రైతుల పొలాలు 3 గంటలకే పారుతయా? అని అడిగారు. రైతులకు 3 లేదా 5 హెచ్.పి.మోటార్లు ఉంటాయి. 10 హెచ్.పి.పెట్టాలటా.. తెలంగాణలో ఉన్న 30 లక్షల మోటార్లకు 10 హెచ్.పి. పెట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి? వాని అయ్య ఇస్తడా ఆ డబ్బులన్నీ అని చురకలంటించారు. కాంగ్రెస్ ఉన్ననాడు కరెంటు ఇవ్వనీకి చేతకాలేదు. మనం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా వుంటే దానికి తొండి పెడతావున్నరని పేర్కొన్నారు. 

ధరణి ద్వారానే రైతుబంధు

కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేస్తమని ప్రమాదకరంగా మాట్లాడుతున్నరు. పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసేసి భూమాత పెడుతరట. అది భూమాతనా లేక భూమేతనా? అని ప్రశ్నించారు. ధరణి ద్వారానే రైతుబంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు డబ్బులు వస్తున్నయి. మరి ధరణిని తీసేస్తే రైతులకు డబ్బులు ఎట్లా రావాలె? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మళ్లీ దళారులు, పైరవీకారులు, లంచావతారాల రాజ్యం తేవాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోంది. మహేశ్వర్ రెడ్డి ప్రజల తరపున యుద్ధం చేస్తాడు. ఆయనకే మీ ఓట్లు వేయాలని కోరారు.

కాంగ్రెస్ మిత్రులు పిచ్చోళ్ళు..మూర్ఖులు..  

రైతు తన స్వంత పెట్టుబడితోని వ్యవసాయం చేసుకునే రోజే బంగారు తెలంగాణ. నేను కలగనేది అదే అని సీఎం తెలియజేసారు. చాలామంది కాంగ్రెస్ మిత్రులకు తెల్వది. నేనేదో పదవి కోసం కొట్లాడుతున్నా అనుకుంటున్నరు. వాళ్లు పిచ్చోళ్ళు.. మూర్ఖులు అని ధ్వ‌జ‌మెత్తారు.  కొట్లాడి తెలంగాణ తెచ్చినం.. ఖచ్ఛితంగా పేదరిక నిర్మూలన కలిగిన తెలంగాణ కావాలని అన్నారు. ఖచ్చితంగా నూటికి నూరు శాతం అక్షరాస్యత ఉన్న తెలంగాణ కావాలని తెలిపారు. ఈ రాష్ట్రం నుంచి పేదరికాన్ని పారద్రోలే దాకా పనిచేయాలని నేను ఫైట్ చేస్తున్నాను అని పేర్కొన్నారు. 

నాకేదో పదవి కావాలని కాదిక్కడ.. 

ప్రజల ఆశీర్వాదంతో నేను ఆల్రెడీ రెండుసార్లు ముఖ్యమంత్రిని అయిన. ఇంకా నాకేదో పదవి కావాలని కాదిక్కడ. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో అన్నింట్లో నంబర్ వన్ కావాలె. ఆ కమిట్మెంట్‌తో పనిచేస్తున్నని సీఎం తెలియజేసారు. ప్రజలు కోరుతున్నట్లుగా పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీ, మరో రెండు మండలాలు కావాలని మహేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు. అవేమీ గొంతెమ్మ కోరికలు కాదు. నా కొడుకు లాంటి మహేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి.. నేను ఒకరోజు పరిగికి వచ్చి అన్ని పనులను పూర్తి చేస్తానని  సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.