బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు. నిర్మల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఎన్నికలు అన్నప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. అందర్నీ ఒకటే ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇప్పటికి ప్రజాస్వామ్య పరిణితి రాలేదు. ఏ దేశాల్లో అయితే అది వచ్చిందో ఆ దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఎన్నో రెట్లు ముందు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.
ప్రజలకు ఒక వజ్రాయుధం ఓటు
నేను చెప్పే మాటలను గ్రామాల్లో, బస్తీల్లో చర్చ పెట్టాలని కేసీఆర్ సూచించారు. కారణం ఏందంటే.. ఎలక్షన్లు వచ్చాయి. రెండో మూడో నాలుగో పార్టీలు పోటీ చేస్తాయి. ఇంద్రకరణ్ రెడ్డి లాగా ఇతర పార్టీల నుంచి కూడా ఎవరో ఒకరు పోటీలో ఉంటారు. 30న ఓట్లు వేస్తారు. 3న లెక్క తీస్తారు. ఎవరో ఒకరు గెలుస్తరు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఒక వజ్రాయుధం ఓటు. మీ ఓటు మీ తలరాతను లిఖిస్తది వచ్చే ఐదేండ్లు. పార్టీల అభ్యర్థలు మంచి చెడు తెలుసుకోవాలి. అభ్యర్థులు గెవడంతో ప్రభుత్వం ఏర్పడతుంది. ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభమేనేది చర్చ జరగాలి. ప్రతి పార్టీ చరిత్ర చూడాలని సూచించారు. ఆయా పార్టీల హాయాంలో ఏం జరిగిందో ఆలోచించాలి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. పార్టీ వైఖరి తెలుసుకోవాలి. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తది. నడవడి ఎట్ల ఉన్నది అనేది గమనించాలి. అప్పుడు ఎన్నికల్లో ప్రజలు గెలుస్తరని స్పష్టం చేసారు.
బీఆర్ఎస్ పుట్టిందే హక్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలుస్తే మీ కోరికలు నెరవేరుతాయి అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, హక్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాకుండా ఉండాలని ఆలోచించే కాపలదారే బీఆర్ఎస్. ప్రజల హక్కుల కోసం 15 ఏండ్లు నిర్విరామంగా పోరాడి, చివరకు చావు నోట్లో తలకాయపెట్టి సాధించుకున్నమని గుర్తు చేసారు. రెండు సార్లు బీఆర్ఎస్‌ను ఆశీర్వదించారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? ఇవన్నీ ఆలోచించాలని అన్నారు. నిర్మల్ జిల్లాను చేయించింది ఇంద్రకరణ్ రెడ్డినే. ఆదిలాబాద్ జిల్లాలో ఏం చేద్దాం ఎన్ని జిల్లాలు చేద్దామని ఆలోచించామని తెలిపారు.
రైతు బంధు పథకం ఏదో ఆషామాషీగా చేసింది కాదు
ఆదిలాబాద్‌తో పాటు మంచిర్యాల చేయాలని నిర్ణయించాం అని వెల్లడించారు. ఇంద్రకరణ్ రెడ్డి మళ్లీ గంట తర్వాత వచ్చారు. బాసర నుంచి ఆదిలాబాద్, బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ రావాలంటే చాలా సమయం పడుతది. కాబట్టి నాలుగు జిల్లాలు చేయాలని అడిగారు. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కావాలని గంటసేపు వాదించారు. ఈ నాలుగు జిల్లాలు చేసిందే ఇంద్రకరణ్ రెడ్డినే. ఈ అమ్మ బొమ్మ.. ఆ అమ్మ బొమ్మ అంటూ మాటలు చెప్పారని ఆరోపించారు. దళిత బంధు వంటి గొప్ప పథకాన్ని మేము ఆవిష్కరించామని పేర్కొన్నారు.
రైతు బంధు పథకం ఏదో ఆషామాషీ కాదు
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామని తెలిపారు. రైతు బంధు పథకం ఏదో ఆషామాషీగా చేసింది కాదని, ఉమ్మడి రాష్ట్రంలో బాధలు పడ్డ రైతులను ఆదుకునేందుకు ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ స్కీం ఇవ్వాలని తనను ఎవరూ అడగలేదని, ఎవరూ ధర్నాలు చేయలేదన్నారు. ధరణి పోర్టల్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మల్‌కు వచ్చినపుడు నేను ఒక్కటే విషయం చెప్పానని, మన పోరాటంలో నిజాయితీ ఉంటే ప్రత్యేక తెలంగాణ తప్పకుండా వస్తుందని చెప్పానని సీఎం గుర్తు చేసుకున్నారు.