mt_logo

వైఎస్ షర్మిళ డబ్బు కట్టలు గెలవాలా? మిషన్ భగీరథ మంచినీళ్ళు గెలవాలా?: సీఎం కేసీఆర్

వైఎస్ షర్మిళ .. సుదర్శన్ రెడ్డి పై పగపట్టిందంట.. వైఎస్ షర్మిళ డబ్బు కట్టలు పంపిస్తదట. వైఎస్ షర్మిళ డబ్బు కట్టలు గెలవాలా? మిషన్ భగీరథ మంచినీళ్ళు గెలవాలా అనేది ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. మీరు ఇవాళ సుదర్శన్ రెడ్డిని గెలిపించి మంచి పని చేశారు. మళ్లీ పోయినసారి కంటే ఎక్కువ సీట్లతో బీఆర్ఎస్ గవర్నమెంటే గెలుస్తుందని చెప్పారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా మీరు సుదర్శన్ రెడ్డినే గెలిపించాలి. సుదర్శన్ రెడ్డి మీ అందరి మంచి కోసం కోరిన పనులన్నీ చేద్దాం.. పెద్ద మనసుతో సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం.. తద్వారా వారికి న్యాయం జరగడం కోసం అని వివరించారు. గతంలో కరెంటు లేకుండే… ఈరోజు కరెంటు ఎట్లా ఉన్నది.. ఎందుకున్నది.. ఎవరి వల్ల ఉన్నదనే అంశాన్ని దయచేసి ఆలోచన చేయాలన్నారు. 

గోదావరి, పాకాల 60 ఏండ్ల డిమాండ్.. ఎవ్వరూ కూడా చేయలేదు.. కానీ సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి చేయించిన విషయం నిజామా కాదా? అనేది మీరు ఆలోచన చేయాలని సూచించారు.  గతంలో యాసంగిలో ఎంత పంట పండేది 35 వేల ఎకరాల పంట కూడా పండేది కాదు. ఇవాళ ఒక లక్షా 35 వేల ఎకరాలు యాసంగిలో నర్సంపేటలో పంటలు పండుతున్నాయి. అది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యమే అని నేను మనవి చేస్తున్నానని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి కంటే ముందు ఎంతో మంది ఎమ్మెల్యేలున్నారు నర్సంపేటకు. వారు ఎవ్వరూ నర్సంపేటకు ఏమీ చేయలేకపోయారు. కానీ సుదర్శన్ రెడ్డి ఈరోజు పాకాల కింద ఆయకట్టుకు ఢోకా లేకుండా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అవునా కాదా అనేది ఆలోచించాలని నేను  కోరారు. మంచి నీళ్ళు.. కృష్ణా, గోదావరి రెండు నదుల మధ్య ఉండే తెలంగాణలో మనం మంచినీళ్ళకు ఎందుకు బాధపడ్డాం..? మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వచ్చాం అని తెలిపారు. మిషన్ భగీరథ మొదలుపెట్టిన ఐదు సంవత్సరాల్లో మంచి నీళ్ళ సమస్యను పరిష్కరించామని స్పష్టం చేసారు. 

కేసీఆర్ కంటే ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులయ్యారు. రెండు నదులుండంగా ఎందుకు మంచినీళ్లియ్యలేదు? మరి ఇవాళ ఎట్లవచ్చినయి? అని అడిగారు. భారతదేశంలో ప్రతి గిరిజన గూడానికి, ప్రతి లంబాడి తండాకు, ప్రతి ఇంట్ల నల్ల పెట్టి నీళ్ళిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. గంగానది ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి కూడా మంచినీళ్ళు దిక్కులేవు. అనేక నదులుండే రాష్ట్రాల్లో కూడా లేవు. ఎందుకు వచ్చినయి మంచి నీళ్ళు కమిట్ మెంట్ ఉంటే, చేయాలనే తపన ఉంటే, ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని నీళ్ళు మోయొద్దంటే, వాళ్ళ భుజాలు కాయలు కాయద్దంటే.. ఆ పట్టుదల వుంటే నీళ్ళు వస్తాయని తెలిపారు. 

వ్యవసాయం, రైతులు బాగుండాలని ప్రతిజ్ఞ పట్టినం, శపథం తీసుకున్నం, పట్టు పట్టినం,  రైతు బంధు ఎక్కడ లేదు భూమండలం మీద. రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పథకం అని తెలియజేసారు. ఈరోజు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు.. నాలుగైదు పనులు చేసాం రైతులు బాగుపడాలని. అవి మీ దృష్టికి తేవాలి నేను. ఒకటి ప్రాజెక్టుల ద్వారా పారే నీళ్ళకు మొత్తం భారతదేశంలో ఒక్క మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు… సీఎం కేసీఆర్ కు ఏం పనిలేదు.. ప్రజలు కట్టే పన్నులన్ని దుబారా చేస్తున్నాడని అంటున్నాడు. ఇంకా డేంజర్ సంగతి చెప్తుండ్రు కాంగ్రెసోళ్లు.. మూడు గంటల కరెంటు ఇస్తే చాలంటుండ్రు. దినంరాత్రి కష్టపడి పనిచేసి తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.