mt_logo

కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉన్నది జాగ్రత్త: నల్గొండ సభలో సీఎం కేసీఆర్

కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉన్నది జాగ్రత్త అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. నల్గొండ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ.. ధరణి బంగాళాఖాతంలో వేస్తామని  కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు. దాని స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. భూమతనా..భూమేతనా అని అడిగారు. పనికిమాలి నోళ్లకు ఓటేస్తే పనికిమాలిన ప్రభుత్వమే వస్తుందని అన్నారు.  రైతుబంధు పుట్టించిందే కేసీఆర్ అని తెలిపారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతుబంధు పోతదని ఆవేదన వ్యక్తం చేసారు.  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగల్భాలు మీకు తెలుసని వ్యాఖ్యానించారు. నకిరేకల్‌లో గెలిచిన తర్వాత పండపెట్టి తొక్కుతామంటున్నారు. అటువంటి వాళ్లు కావాలా? అని సీఎం అడిగారు. 

ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు

నేను వస్తుంటే సంతోషమేస్తుంది. యాసంగి పంటకు పొలాలన్నీ నీటితో తడిపి ఉన్నాయి.  అంతకు ముందు నల్లగొండలో తిరిగితే లక్షల ఎకరాలు ఆముదం పంట పండించేది. ఈ రోజు బ్రహ్మండగా వరి పంట పండుతున్నదని సంతోషించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. నల్లగొండ నియోజకవర్గం ఇంకా నా దత్తతలో ఉంది. నా డ్యూటీ అయిపోలేదు. భూపాలరెడ్డి డ్యూటీ అయిపోలేదన్నారు. ఇప్పటివరకు సంక్షేమంచేసినం. రైతులను ఆదుకున్నాం అని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం. టాస్క్ లాగా తీసుకుని ఇండ్లు కట్టిస్తాం.. నల్గగొండను కాపాడుకోవాల్సిన బాధ్యత నల్గొండ ప్రజలదే అన్నారు.  మీరు ఊహించనంత అభివృద్ధి చేసి చూపిస్తా..  కారు గుర్తుకు ఓటేసి గెలిపించండని సీఎం కేసీఆర్ కోరారు.