mt_logo

ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తారో ఆలోచించి ఓటెయ్యాలి: సీఎం కేసీఆర్

ఏ పార్టీ చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తారో ఆలోచించి ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ సూచించారు. నకిరేకల్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ.. ఈ జిల్లా వట్టికోట ఆళ్వారు స్వామి పుట్టిన జిల్లా అని ఆనందించారు. నర్రా రాఘవరెడ్డి ఉద్యమాలు చేసిన గడ్డ అని గుర్తు చేసారు. బాగా చైతన్య ముండే ప్రాంతమని నా విశ్వాసం అని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఈ బీఆర్ఎస్ పుట్టిందని స్పష్టం చేసారు. 15 సంవత్సరాలు పోరాటం చేసి అనేక మంది జైళ్ల పాలై, శిక్షలు అనుభవించి పోరాడినం అని వివరించారు. 

ప్రజల ఆశీర్వాదంతో.. 15 సంవత్సరాల ఉద్యమం. 10 సంవత్సరాల పరిపాలన మీ కండ్ల ముందుందని అభివర్ణించారు. తెలంగాణ వచ్చిన నాడు చాలా అధ్వాన్నమైన పరిస్థితులు.. మంచినీళ్ళు లేవు. సాగునీరు లేదు. కరెంటు లేదు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు. రైతుల ఆత్మహత్యలు. చాలా భయంకరమైన పరిస్థితులుండే అని బాధపడ్డారు. బ్రాహ్మణ వెల్లెం ప్రాజెక్టు పూర్తయితే రాబోయే ఐదారు నెలల్లో ఒక లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని తెలిపారు. కాళేశ్వరం లింక్ చేసి భువనగిరి దగ్గర కట్టినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి రామన్నపేట ప్రాంతానికి కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. రామన్నపేట చాలా కరువు ప్రాంతం నాకు తెలుసు. ఇవ్వన్ని మేం చేసినం అని పేర్కొన్నారు. 

ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. చాలా ప్రమాదం. ఇందిరమ్మ రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరు ఏం చేసిండ్రు, ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరో, ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తరు అని ఆలోచించి ఓటేస్తే మీకు లాభం జరుగుతుందో ఆలోచించండని కోరారు. చిరుమర్తి లింగయ్య ప్రజల్లో ఉండే మనిషి. తన వ్యక్తిగత పనులు గురించి ననెన్నడు  అడుగలేదని తెలిపారు. మంచి మనిషి. ఆయన్ను బ్రహ్మాండంగా గెలిపించండని కోరారు. నేను నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా అని హామీ ఇచ్చారు.