mt_logo

కాంగ్రెస్ పార్టీకి వచ్చేది 20 సీట్ల లోపే: మధిర సభలో సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పార్టీకి మల్లా వచ్చేది 20 సీట్ల లోపే అని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. మధిర ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మనకు రాజకీయ విరోధి. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఎమ్మెల్యే అయినా.. దళిత బంధు పైలట్ ప్రాజెక్టును మధిరలోని చింతకాని మండలంను పెట్టాను.  చింతకాని మండలాన్ని దళిత బంధులో పెట్టమని నన్ను ఎవరూ డిమాండ్ చేయకున్నా, ధర్నాలు చేయకున్నా పెట్టాను. ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇచ్చాం అని తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో స్వతంత్రం వచ్చినప్పడే ‘దళిత బంధు’ లాంటి పథకం పెట్టి అమలు చేసివుంటే ఈనాటికీ దళితులు దుస్థితిలో ఉండేవారా?. దళిత అక్కచెల్లెండ్లూ.. అన్నదమ్ములూ ఆలోచన చేయాలని సూచించారు. 

ప్రధాని మోడీ రాష్ట్రంలో దుర్మార్గమైన దాడులు

దళిత సమాజం దోపిడీకి గురైన ప్రాంతం.. తరతరాలుగా అణచివేయబడ్డ సమాజం. వెలివేయబడి వెలివాడల్లో నివసించబడిన సమాజం. దళితులు మన సాటి మనుషులు కారా? మనలాగా తయారు కాకూడదా? పైకి రాకూడదా? అని నిలదీశారు. ఎంతకాలం దేశంలో దరిద్రం ఉంటదో.. దేశానికి ఒక మచ్చ ఉంటది తప్ప పోదన్నారు.  ఉత్తర భారతదేశంలో ఇవ్వాల దళితులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ రాష్ట్రంలో కూడా దుర్మార్గమైన దాడులు. అతి తీవ్రమైన వివక్ష ఉందని ఆరోపించారు. తెలంగాణ ‘దళిత బంధు’ భారతదేశ దళిత జాతికే ఒక మార్గదర్శనం చేయాలని అన్నారు. ఈ దేశం మొత్తానికి పోవాలని మనం పెట్టుకున్నం. దళిత యువతీ, యువకుల్లో అనేక వజ్ర, వైఢూర్యాలున్నాయి. వాళ్లకు అవకాశాలు లేకుండా ఉన్నారు.   ’దళిత బంధు’లో ఉట్టిగానే పది లక్షలు ఇచ్చి ఊరుకోవడం కాదు. మద్యం వ్యాపారాల్లో రిజర్వేషన్లు పెట్టి 260 మంది దళిత బిడ్డలకిచ్చినం అని పేర్కొన్నారు. దళితులు కూడా ఊహించని రంగాల్లో వారు ప్రవేశించాలని చిత్తశుద్ధితో ఎవరూ చేయని విధంగా రిజర్వేషన్లను పెట్టాం. ఇవన్నీ నాకెవరూ చెప్పలేదు. నా అంతట నేను పెట్టుకున్న ప్రోగ్రాం అని వెల్లడించారు. మరి దళిత బిడ్డలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలండీ.. అని సీఎం అడిగారు. 

భట్టి విక్రమార్కకు ఓటేస్తే ఏమొస్తది?

పట్టిలేని భట్టి విక్రమార్కకు మీరు ఓటేస్తే మీకు వచ్చేదేంది? పట్టిలేనటువంటి భట్టి విక్రమార్క మనకు చేసేదేముంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచేది లేదు.. సచ్చేది లేదు. కానీ ఇయ్యాల కాంగ్రెస్‌లో డజన్ మంది ముఖ్యమంత్రులున్నరు. నేను గ్యారంటీగా చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీకి మల్లా వచ్చేది 20 సీట్ల లోపే అని తేల్చి చెప్పారు. నా ఎన్నికల పర్యటనలో భాగంగా మధిర 70వ అసెంబ్లీ నియోజకవర్గం. మిగిలని 30 నియోజకవర్గాలకు కూడా నేను వెళ్లిన తర్వాత కాంగ్రెస్ ఇంకా ఊడ్సకపోతదన్నారు. నేను ఎట్లెట్ల పోతున్ననో.. కాంగ్రెస్ అట్లట్ల ఊడ్సకపోతావున్నది. కాంగ్రెస్‌లో ఏం లేదు.. అంతా వట్టిదే డంభాచారం అని ఎద్దేవా సీఎం చేసారు.  కమల్‌రా జ్‌ను గెలిపిస్తే లాభం వస్తది గాని, భట్టితో వచ్చేదేమి..పోయేదేమి..అని అడిగారు.  నామాటను గౌరవించి సౌమ్యుడు, విద్యాధికుడు, మీ మధ్యనే ఉండే కార్తీక్ రాజు గెలిపిస్తే మీకు అన్ని రకాలుగా నేను అండదండలిస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకే ఓటెయ్యండని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేసారు.