mt_logo

కాంగ్రెస్ వైఖరి సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు ఉంది: సీఎం కేసీఆర్

ఒక్క ఛాన్స్ అడుగుతున్న కాంగ్రెస్, ఒక్క ఛాన్స్ ఇస్తే పంటికి అందకుండా మింగుతరా? అని కాంగ్రెస్‌ని సీఎం కేసీఆర్ నిలదీశారు.  బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మోతె గ్రామం మొదట  తీర్మానం చేసిందని వెల్లడించారు. తెలంగాణ మట్టిని ముడుపు కట్టుకుని హైదరాబాద్‌కు తీసుకువెళ్లానని తెలిపారు. తెలంగాణ వచ్చినాక మళ్లీ ఇక్కడికి తెచ్చి మోతెలో అదే మట్టి కలిపినామని గుర్తు చేసారు. ఎలక్షన్లో ఎవడో వచ్చి ఏదో మాట్లాడుతడు,  సాయి సంసారి. లచ్చి దొంగ అనొచ్చని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలవడమే కాదు.. వీళ్ల గెలుపుతోనే రాష్ట్రంలో పార్టీ గెలుస్తదని చెప్పారు. 

ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ఎన్నికల్లో నిలబడ్డాయి. ఏ పార్టీ చరిత్ర ఏంటో . ఏ పార్టీ ప్రజలకు ప్రయోజనం కలిగించిందో మీరు ఆలోచించాలన్నారు.  అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నడు అని ఆలోచించాలి. చర్చ చేయాలి. ఇంత పెద్ద ఎత్తున భారీ సభలు ఉండవని, ఇతర దేశాల్లో ఇటువంటి సభలు ఉండవు. అక్కడి నాయకులు టీవీల్లో మాత్రమే మాట్లాడుతారని తెలియజేసారు. ఓటు అనేది మన కిస్మత్‌ను నిర్ణయిస్తుందన్నారు.  ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏకబిగిన 50 ఏళ్లు పాలన చేసింది. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే పంటికి అందకుండా మింగుతరా? అని ప్రశ్నించారు. 

 దేశంలో నెంబర్‌వన్‌గా తెలంగాణ

ప్రశాంత్ రెడ్డి కన్నా ముందు చాలా మంది ఎమ్మెల్యేలు బాల్కొండలో ఉండే, అప్పుడు ఏం జరిగింది. ప్రశాంత్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో చర్చించాలన్నారు. 18 సబ్ స్టేషన్లు కట్టాడు ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో అని స్పష్టం చేసారు. సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తయితే 4 కోట్ల ధాన్యం పండించి దేశంలో నెంబర్‌వన్‌గా తెలంగాణ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ కు ఓటేస్తే.. మంది మాటలు పట్టుకుని మార్వానం పోతే ఇంటికి వచ్చే వరకు ఇళ్లు కాలిపోయింది. అన్నట్లు ఉంటుందని అన్నారు.

 బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ

భగీరథ బ్రహ్మాండగా విజయవంతం చేసుకున్నాం అని అభివర్ణించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు అయిపోతే మిగులు కరెంటు ఉంటుందని సూచించారు. 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటారు. ఏ ఒక్క రాష్ట్రం కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలేదు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆర్థిక పరిస్థితి పెరిగిన కొద్దీ పెన్షన్ పెంచుకుంటూ పోయినం. రేపు 5 వేల పెన్షన్ రాబోతుంది . మీ ఒక్క ఓటు కూడా పోవద్దని, బీఆర్ఎఎస్‌కు ఓటేయ్యాలే అని కోరారు. ప్రశాంత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించండని విజ్ఞప్తి చేశారు.