mt_logo

మనకు కులం, మతం, జాతి లేదు అందరికీ ఒకటే ప్రాధాన్యత: సీఎం కేసీఆర్

మనకు కులం, మతం, జాతి లేదు అందరికీ ఒకటే ప్రాధాన్యత ఉంటుందని  సీఎం కేసీఆర్ అన్నారు.  భువనగిరి ‘ప్రజా ఆశీర్వాద సభ’ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిలో ఈరోజున చాలా అద్భుతమైన పంటలు పండుతున్నాయని అన్నారు. గోదావరి జలాలు, ఇక్కడున్న రెండు మూడు కాలువలు ఈ ప్రాంతానికి రావాలని మనం ఎన్నో పోరాటాలు చేసాం అని తెలిపారు. ఎన్నో కలలు కన్నాం. కాలువల పనులు జరుగుతా ఉన్నయ్. త్వరలో పూర్తవుతాయి. ఈ జిల్లాకు లక్ష్మీ నర్సింహస్వామి ఆశీస్సులతోని యాదాద్రి భువనగిరి జిల్లా అని భగవంతుని పేరు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకుంటే భువనగిరి జిల్లానే కాకపోతుండె అని స్పష్టం చేశారు.  మళ్లీ శేఖర్ రెడ్డిని గెలిపిస్తారు కాబట్టి.. 98 శాతం పూర్తయిన బస్వాపూర్ రిజర్వాయర్.. నృసింహ సాగర్ ను ప్రారంభించుకుని లక్ష ఎకరాలకు సాగునీరును అందిస్తాం అని తెలిపారు. 

భువనగిరికి ఐటీ హబ్, ఐటీ పరిశ్రమ

ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు. వాస్తవ పరిస్థితులను గ్రహించి, ఆలోచించి ఓటెయ్యాలి. మన ప్రగతికి, మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వెయ్యాలని సూచించారు. ఒక ఉద్వేగంతో కొట్టుకెళ్లి ఓటు వేస్తే మన జీవితాలు తలకిందులయ్యే అవకాశం ఉంటదని అన్నారు.  భువనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గం. హైదరాబాద్‌కుసమీపంలో ఉన్నది. భువనగిరిని ఐటీ హబ్ చేసి, ఐటీ పరిశ్రమలు రావాలని, ఖచ్ఛితంగా తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు చెప్పిన. ఎన్నికల తర్వాత భువనగిరికి స్పెషల్ ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టించే బాధ్యత నాది. బ్రహ్మాండంగా మన పిల్లలకు ఉద్యోగాలు దొరికే ఆస్కారం ఉంటదన్నారు.

మనకు కులం, మతం, జాతి లేదు 

50 వేల ఓట్ల మెజార్టీతో పైళ్ల శేఖర్ రెడ్డి గెలవబోతున్నాడుని ఆశాభావం వ్యక్తం చేశారు దయచేసి బీఆర్ఎస్ ను గెలిపించండి.. శేఖర్ రెడ్డిని దీవించండని విజ్ఞప్తి చేశారు. మనకు కులం, మతం, జాతి లేదు. ఎన్నికల ప్రణాళికలో అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. మహిళలకు సాధికారికత తెచ్చాం, 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు కేసీఆర్ బీమా వస్తది. అందరికీ సన్నబియ్యమే వస్తది..ఇది నా మాటగా హామీనిస్తావున్న.యాదాద్రి నరసింహ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా చేసుకున్నం. భవిష్యత్తులో ఈ జిల్లా ఒక బంగారు తున్కలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణ రాకముందు అనేక మంది సన్నాసులు అవాకులు, చెవాకులు పేలినారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పినారు. ఇవ్వాల భూముల ధరలు ఎట్లా ఉన్నాయో మీ అందరికీ తెలుసు.  యాదగిరి గుట్ట దగ్గర పొద్దున ఒకరేటు, మధ్యాహ్నాం ఒకరేటు, సాయంత్రం ఒక రేటులో ఇవ్వాల కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయలు లేదు. భూమిలేని నిరుపేదలకు కూడా న్యాయం జరగాలని బీమా, సన్నబియ్యం, సౌభాగ్య లక్ష్మి, గృహ నిర్మాణాలను ప్రకటించాను. మీ ఆశీస్సులతో మళ్లీ గెలిపిస్తే మీ సేవలో భువనగిరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని తెలిపారు. పైళ్ల శేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతావున్నానని పేర్కొన్నారు.