ప్రముఖ తెలుగు సంస్కృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సింగరాచార్యుల భాషా సాహిత్య కృషిని, అధ్యాపకులుగా ఉపన్యాసకులుగా రచయితగా వ్యాకరణ పండితుడిగా తెలుగు సంస్కృత భాషలకు వారు చేసిన సేవలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.వారి కుమారుడు ఎడిటర్ కె. శ్రీనివాస్ సహా కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.