mt_logo

మత మౌడ్యమే మనకు ముప్పు : సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘మనిషి చాలా చిన్నవాడు. అనేక రూపాలలో, అనేక పద్దతుల ద్వారా పరమాత్మ మనిషిని దీవిస్తుంటాడు. భాష, భావం, దేశం, ఖండం వేరుకావచ్చును. కాని… పరమాత్మను ఆరాధించడం అనేది మానవ జీవితం ప్రారంభం నుంచి నేటి వరకు పరంపరగా కొనసాగుతూ వస్తున్నటు వంటి ఒక చక్కటి మానవ కళ్యాణం కోసం సాగుతున్నటువంటి సందర్భం. మనిషి తనకు తానుగా ఎదైనా విజయాన్ని పొందితే అది నేను సాధించానని చెప్పుకుంటాడు. పకృతి వైపరీత్యాలు సంభవిస్తేనో… ఎదైనా ఒక అపజయం సంభవిస్తేనో… భగవంతుని దయ తప్పింది అని భగవంతుని మీద నింద వేస్తాడు.మన ఇంట్లో పెద్దలు కాలం చేసినప్పుడో.. మనకు దుఖాలు, కష్టాలు కలిగిన సందర్భాల్లో ఆ ఊర్లో వుండే అయ్యవారు వచ్చి ఆ గృహంలో నాలుగు రోజులు కుటుంబ సభ్యులను సాంత్వన పరిచి వాల్లను భాధ నుంచి బయటపడేసే పయత్నం జరుగుతుండటం మనం కళ్లరా చూస్తున్నాం.

మత మౌఢ్యం, పిచ్చి మనిషిని అమానుషమైన పనులు చేయిస్తుంటుంది

దేవాలయం అనేది ఒక కమ్యూనిటీ సెంటర్. అన్ని మతాలకు దేవాలయం తోని సంబంధం వుంటుంది. మతం అనేది సార్వజనీనం. కానీ మతంలో తప్పులేదు. మత మౌడ్యమే మనకు ముప్పు. ఎ మతం కూడా తప్పులు చేయమని చెప్పదు. కానీ మత మౌడ్యమే.. మానవున్నీ ఒక పిచ్చిలోకి, ఒక ట్రాన్స్ లోకి తీసుకెళుతుంది. మత మౌఢ్యం, పిచ్చి మనిషిని అమానుషమైన పనులు చేయిస్తుంటుంది. ఏ మతంలో కూడా హింసకు తావులేదు. అది ఏ మతమన్నా కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా…ప్రపంచ వ్యాప్తంగా ఎ మత ప్రవక్త కూడా హింసను బొధించలేదు. మన హిందూ మతంలో అసలు చెప్పలేదు. కృష్ణ పరమాత్మ అసలే చెప్పలేదు. దాన్ని మౌఢ్యానికి జతచేసి కొంతమంది మధ్యలో వచ్చినవాళ్లే చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ గొప్ప రచయిత. వోల్గా నుంచి గంగా అనే తన గొప్పరచన ద్వారా ఇదే విషయాన్ని చెప్పాడు. వేదాల్లోని, ఉపనిషత్తులోని పరమార్థాన్ని అర్థం చేసుకుని అది పంచిన సందేశాన్ని విశ్వానికి పంచితే అంతకు మించి పరమార్థం లేదని, కొంతమంది వేదాల సారాన్ని వక్రమార్గం పట్టిస్తున్నారనే విషయాన్ని రాహుల్ సాంకృత్యాయన్ గారు ఉద్గాటించారు.

విశ్వశాంతి కోసం ప్రపంచ సంక్షేమం కోసం యాగాలు

హరే కృష్ణ వారు తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తున్న తోడ్పాటు గొప్పది. అక్షయపాత్ర వారు అన్నపూర్ణ ద్వారా అందిస్తున్న భోజనం చిన్నారి స్కూల్ పిల్లలనుంచి ముదులు కొని హైదరాబాద్ లో ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా ఎక్కడి నుండి కంప్లేట్ లేకుండా చేస్తున్నారు. ఇది వారి అంకితభావానికి నిదర్శనం. అక్షయపాత్ర వారికి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు. సందర్బం ఎప్పుడు వచ్చినా.. అది కలరా కాని, కరోనా కానీ మీము ముందు వరసలో వుంటామని వారు ముందుకు వస్తుంటారు. మతం పేరిట చెలరేగేటువంటి దుష్పరిణామాలను నివారించేందుకు, అది పేట్రేగకుండా వుండడానికి హరేకృష్ణ సంస్థ కూడా కృషి చేయాలి. మతాన్నీ హృదయపూర్వకంగా విశ్వసించే వారు మతమౌఢ్యం ఎప్పుడూ కోరుకోలేదు. విశ్వశాంతిని కోరుకునే యజ్ఞాలు మనం చేస్తాం. విశ్వశాంతి కోసం ప్రపంచ సంక్షేమం కోసం యాగాలు చేస్తాం. భాగా అబివృద్ది చెందుతున్న హైదరాబాద్ లో మానవ జీవితాల్లో రోజురోజుకు వేగం పెరుగుతున్నది. అనేకరకమయినరోగాలను ఎదుర్కోంటున్నాము. దేవాలయంలో సాగే భక్తి, భజనలు, కీర్తనలు, చాలా సందర్భాల్లో మనిషికి సాంత్వన చేకూర్చే ఔషదల్లాగా పనిచేస్తాయి.

హరే కృష్ణ వారు చేపట్టిన దేవాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నాను. వీటిని త్వరలోనే విడుదల చేయడం జరుగుతుంది. శాంతిని, ఆధ్యాత్మికతను పెంపొందించే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తుంది. మధు పండిత్ చెప్పినట్లుగా అత్యధ్బుతంగా నిర్మించిన ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరిగుట్ట దేవాలయానికి సర్వత్రా అభినందనలు లభిస్తున్నాయి. అదే విధంగా ఆధ్యాత్మికతను పెంపొందించే వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం దేవాలయాలను కూడా అభివృద్ది చేస్తున్నాం. దేశానికి, విశ్వానికి శాంతియుత సమాజమే రేపటి భవిష్యత్తు అని మేము భావిస్తున్నాము. మనకు శాంతి ఆధ్యాత్మిక అహ్లదకరమైన వాతావరణం, ప్రశాంతమైన జీవనం కావాలంటే అది మందిరాలు, మసీదులు, చర్చిల ద్వారా సాధ్యం. అక్కడ సాగే ప్రార్థనల ద్వారా శాంతి నెలకొల్పబడుతుంది’’ అని సిఎం కేసిఆర్ అన్నారు. ఈ దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ప్రజలకు సేవలందించాలని సీఎం కోరుకున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, కార్యనిర్వాహకులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.