హైదరాబాద్, జూన్ 14: రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా …ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా నిర్మించనున్న ‘దశాబ్ధి వైద్య భవనా’ల్లో నూతనంగా 2000 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత అధునాతన ఆపరేషన్ థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు రకాల వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లబ్ధిదారులు పార్వతి – ఉదయ నగర్ కాలనీ చెందిన పార్వతి, భోళానగర్ కు చెందిన పర్వీనమ్మ, ఎంబీటీ నగర్ కు చెందిన శిరీషమ్మ, ప్రతాప్ నగర్ పంజాగుట్ట తేజస్విని, శ్రీరామ్ నగర్ కు చెందిన సుజాతమ్మ, అంబేద్కర్ నగర్ రేణుకమ్మ లకు న్యూట్రిషన్ కిట్లను సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు అందజేశారు.