ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని, వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షముగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు సిద్ధిపేట జిల్లా, ఎర్రవల్లిలో చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం గత ఐదురోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యాగం పూర్తికానున్నది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.