BRS అభివృద్ధి రాజకీయానికి ప్రజల ఓటు : తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
BRS పార్టీ జాతీయ జైత్రయాత్రలో మొదటి అడుగు పడింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ తాలుకాలోని అంబెలోహల్ గ్రామ వార్డు సభ్యుడిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ విజయం సాధించారు. అంబెలోహల్ గ్రామంలోని మొదటి వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన 115 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి అతి తక్కువ కాలంలోనే ప్రజాధరణ విశేషంగా పెరిగింది అనడానికి ఇది నిదర్శనం. రాష్ట్రం బయట బీఆర్ఎస్ కు దక్కిన మొట్టమొదటి విజయం ఇది. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశమంతా గమనిస్తోంది. ప్రజలు అభివృద్ధి రాజకీయాన్ని కోరుకుంటున్నారు. విధ్వంస రాజకీయాలు కోరుకోవడం లేదని ఈ గెలుపు ద్వారా మరోసారి స్పష్టమైంది. అందుకే మహారాష్ట్రలో బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు పట్టం కట్టారు. విధ్వంస రాజకీయాలు చేసిన బీజేపీకి తాజాగా జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. బీజేపీ అభ్యర్థులు 31 చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీని కాదని, ప్రతిపక్ష కాంగ్రెస్ ను పక్కకు నెట్టి బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు ఓటేశారంటే ప్రజలు కేసీఆర్ పాలనను ఏ స్థాయిలో కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. తమ గురించి ఆలోచించే వారిని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారనడానికి ఇదే నిదర్శనం. మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోగలదని అక్కడి ప్రజలు మూడ్ ను బట్టి అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ఇప్పటికే ఓ విజయం సాధించింది. కేసీఆర్ ప్రకటనతో కదిలిన మహారాష్ట్ర సర్కారు తెలంగాణలో మాదిరి రైతుబంధు పథకం అమలు చేస్తామని ప్రకటించింది. ఇది బీఆర్ఎస్ నైతిక విజయం. ఇప్పుడు ఎన్నికల్లో విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. వార్డు సభ్యుడిగా ఎన్నికైన గఫూర్ సర్దార్ పఠాన్ కు శుభాకాంక్షలు.