mt_logo

మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు

హైదరాబాద్, మే 26: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన  బేగంపేట లోని హరిత ప్లాజా లో బోనాల ఏర్పాట్లపై ప్రారంభమైన ఉన్నతస్థాయి సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, CS శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, DGP అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్ 22 న గోల్కొండ లో ఆషాడ బోనాలు  ప్రారంభమవుతాయి, జులై 9 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10 రంగం, 16 న ఓల్డ్ సిటీ బోనాలు, 17 న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే  విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి.. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..