మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీశ్ రావు.
డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవం కొనలేరు
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవం కొనలేరు. మెదక్ అడ్డాలో డబ్బు సంచులు పని చేయవని స్పష్టం చేశారు. ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజలకు సేవ చేయాలి. మెదక్ పుకార్లు తిప్పికొట్టాలి. హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్యే పద్మ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ మాట తప్పారని తేల్చి చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ గారి వల్ల, పద్మ గారి వల్ల మెదక్ జిల్లా అయ్యింది. మెడికల్ కాలేజీ వచ్చింది. రైలు వచ్చింది. ఘన్ పూర్ ఆనకట్ట నీళ్ళు వదలాలని ధర్నాలు చేసే రోజులు లేవు, రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నది కేసీఆర్ అని తెలిపారు.
కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం
కరెంట్ నిరంతరం ఇస్తున్నారు. పండుగల వేళ ఎన్నికల పండుగ వచ్చింది. రకరకాల వ్యక్తులు వస్తున్నారన్నారు. దండగ అన్న వ్యవసాయం పండుగ చేసింది కేసీఆరే అని తెలిపారు. పెట్టు బడి నాడు రూపాయి లేని పరిస్థితి. ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తున్నాం.. ఉచిత కరెం ట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడు. 3 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా? 24 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా? అని అడిగారు. ఎండాకాలంలో కూడా పంటకు నీళ్లు అందుతున్నాయి. గుంట కూడా ఎండటం లేదని గుర్తు చేశారు. కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో వెలుగు ఉందన్నారు. కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శమని తెలిపారు.
నేడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తుంది
కిసాన్ సమ్మాన్ నిధి, హర్ ఘాట్ జల్, కళ్యాణ లక్ష్మి, మూగ జీవాలకు అంబులెన్స్ లాంటివి కేంద్రం మనవి కాపీ కొట్టి అమలు చేస్తున్నదన్నారు. నాడు బెంగాల్ ఉండేది. నేడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరించే పరిస్థితి ఉందన్నారు. పద్మ గెలుపు, మెదక్ అభివృద్ధికి మలుపుని సూచించారు. జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలుపు కోసం అందరం కృషి చేయాలని అన్నారు.