mt_logo

టొరంటో నగరంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో అక్టోబరు 1, 2016 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టొరంటోలోని లింకన్ అలగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 600 మంది ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రయదుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకున్నారు.

సంఘం ఆధ్వర్యంలో ఇది పన్నెండొవ బతుమ్మ కాగా తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడవ బతుకమ్మ కావడంతో అందరు కూడ పండుగను అత్యంత సంబురంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో మంచి రుచికరమైన భొజనాలు ఏర్పాటుచేసారు.

అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారు మాట్లాడుతూ తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో చేయబడే అన్నికార్యక్రమాలలో ఇంతే ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయవలెనని సభికులందరిని కోరారు.

బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనంచేసి సాంప్రదాయబద్దంగా తయారు చేసుకొనివచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *