హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వర్షాకాల శాసనసభ సమావేశాల్లో భాగంగా సభలో ఈరోజు గౌరవ టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రశ్నోత్తరాల సమయంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను సభలో వివరించారు. గత 25 రోజుల నుండి పంచాయతీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారని వారి యొక్క సమ్మె న్యాయమైందని అన్నారు. ఆయన 1981 సంవత్సరంలో చీమను పల్లి గ్రామ సర్పంచ్ చేసినప్పుడు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీతభత్యాలు 50 రూపాయల నుండి 100 రూపాయలు చెల్లించేవారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు మనసున్న మారాజు పెద్ద మనసు చేసుకొని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 9,500/- పెంచడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి లో భాగంగా తడి చెత్త మరియు పొడి చెత్త వేరు చేస్తూ డంప్ యార్డుల వద్ద చెత్తను వేయడానికి కార్మికులు గ్రామాలలో చాలా కష్టపడుతున్నారని అన్నారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో రెండు గ్రామాలు జాతీయ అవార్డులు పొందడం ఆనందంగా ఉందని దాని వెనుక కార్మికుల కష్టం కూడా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ కల్పించి జీతాలు పెంచాలని కార్మికుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని శాసన సభా ముఖంగా తెలియజేశారు. గౌరవ టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి విజ్ఞప్తి మేరకు గౌరవ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సానుకూలంగా స్పందించి సమస్యను నోట్ చేసుకోవడం చేసుకున్నారు.