మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన అలియంట్ గ్రూపు కంపెనీకి చెందిన సీఈవో ధవల్ జాదవ్‌ను హూస్టన్‌లో కలిసారు. ఆ గ్రూపు సంస్థ హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయునుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ రంగంలో అలియంట్ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పవర్‌హౌజ్‌గా పేరుగాంచిన అలియంట్ గ్రూపు సంస్థ, హైదరాబాద్‌లోని బీఎఫ్ఎస్ఐ రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు మంత్రి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ లో ఆ సంస్థ కొత్తగా 9 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలియజేసారు. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీసెస్ మరియు కోర్ ఐటీ టెక్నాలజీలలో యువతకు గొప్ప అవకాశం అవుతుందని మంత్రి అన్నారు. అలయంట్ తీసుకున్న నిర్ణయం మరోసారి హైదరాబాద్ నగరంపై BFSI పరిశ్రమ ఉంచిన అచంచలమైన విశ్వాసానికి ఉదాహరణ అని అన్నారు.