mt_logo

ఉన్మాదిగా మారిన ఒక పత్రికాధిపతి కథ!

By: -గుణవీర శరత్‌చంద్ర

అనగనగా ఒక పత్రికాధిపతి!
అడ్డదారిలో దొడ్డిదారిలో అడ్డమైన గడ్డికరిచి పైకొచ్చినవాడు!
కానీ సత్యహరిశ్చంద్రుని వంశాంకురంలాగా పోజు పెడతాడు!
అన్ని తప్పులూ చేసినవాడు, అందరికీ నీతిబోధలు చేస్తుంటాడు!
ఏ అర్హతా, ఏ పేరూ లేనివాడు, అందరకీ పేర్లు పెడుతుంటాడు!
ఆయనకు తెలంగాణపై అకారణ విద్వేషం!
తెలంగాణ నేతలపై అంతులేని అక్కసు!
ఆయన తెలంగాణ ఉద్యమంపై మరోసారి విషం చిమ్మాడు!
ఉద్యమ పార్టీలకు, నాయకులకు కొత్త పేర్లు పెట్టి నిందిస్తున్నాడు!

ఆయన దృష్టిలో-
తెలంగాణ రాజకీయ శక్తులను ఏకం చేస్తున్నవాడు బకాసురుడు!
తెలంగాణ రాజకీయ బలాన్ని చాటాలని ప్రయత్నించినవాడు బకాసురుడు!
తెలంగాణ రాజకీయాలన్నీ తెలంగాణ చుట్టే తిరగాలని శాసిస్తున్నవాడు బకాసురుడు!
సీమాంధ్ర పార్టీలకు, ఏజెంట్లకు తెలంగాణలో చోటు ఉండరాదని చెబుతున్నవాడు బకాసురుడు!

తెలంగాణను మింగినవాడు బకాసురుడు కాదు!
తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసినవాడు బకాసురుడు కాదు!
తెలంగాణ యువకులపై దమనకాండను సాగించినవాడూ బకాసురుడు కాదు!
యుద్ధం జరుగుతుంటే అమెరికా చెక్కేసినవాడు బకాసురుడు కాదు,
తెలంగాణలోనే వ్యవసాయ క్షేత్రం చెక్కేసినవాడు మాత్రం బకాసురుడు!

ఆయన లగడపాటిని మించిన ఉన్మాది!
తెలంగాణపై విద్వేషోన్మాదానికి సరికొత్త పేరు!
ఆ పత్రికాధిపతికి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంత ముద్దొస్తున్నాడో!
ఆయన సమర్థతను చూసి ఎంతగా పులకించిపోయాడో!
కిరణ్ ‘చలో అసెంబ్లీని విఫలం’ చేశాడట!
అందుకాయన ఉబ్బితబ్బిబ్బయిపోయాడు!
తెలంగాణను అణచివేసే విషయంలో ఆయనకు కిరణ్‌లో మరో రాజశేఖర్‌రెడ్డి కనిపించాడట!
ఆయనకు తెలంగాణను అణచివేయడంలో రాజశేఖర్‌రెడ్డి గొప్పవాడే! రాజశేఖర్‌రెడ్డి ఆదర్శమే!
తెలంగాణను అణచివేస్తానని హామీ ఇస్తే జగన్‌మోహన్‌రెడ్డిని కూడా ప్రేమిస్తాడేమో!

విడ్డూరం ఏమంటే….
తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజాప్రతినిధులను టోకున కొనుగోలుచేసి, మొత్తం తెలంగాణవాదాన్నే మింగేయాలని చూసిన రాజశేఖర్‌రెడ్డి బకాసురుడు కాదు, హీరో!

తెలంగాణ ప్రజలపై ఉక్కుపాదాలతో నడిచినవాడు బకాసురుడు కాదు,  తెలంగాణ ప్రజలను సొంత హైదరాబాద్‌లోనే పరాయీలను చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి మహాసమర్థుడు, మొండివాడు, శహబాష్ అనిపించుకున్నవాడు!

తెలంగాణ ప్రజలు యుద్ధభూమిలో కొట్లాడుతుంటే, ప్రతిపక్షనాయుకుడై ఉండీ పల్లెత్తుమాట మాట్లాడకుండాఅమెరికా చెక్కేసినవాడూ నీరో కాదు, హీరోనే!
టీడీపీని, దానిని స్థాపించిన మామను మింగేసి, ఆయన సమాధికి పూలమాలలు వేసి పూజలు చేసేవాడు బకాసురుడు కాదు, వాసుదేవుడు!
అచ్చెసరు ఓట్లతో ప్రభుత్వం అసెంబ్లీ నడిపిస్తుంటే దానిని నిలదీయాల్సిన సమయంలో ప్రతిపక్ష నాయకుడై ఉండీ విహారయాత్రలకు వెళ్లడం హీరోయిజమే!
తెలంగాణ ఉద్యమాన్ని మింగేయాలని చూసిన వాళ్లంతా ఈ పత్రికాధిపతికి ఆరాధ్యులు!
తెలంగాణవాదిగా నటిస్తున్న పచ్చి సమైక్యవాది ఆయన!
ఆ మేకవన్నె పులి ఎవరి పక్షమో ఇప్పటికయినా అర్థమవుతోందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *