సూర్యాపేట, జూన్ 7 : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం వరుసగా 21 రోజుల పాటు ప్రభుత్వ పథకాలతో వేడుకలను నిర్వహిస్తున్నా విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బుధవారం సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కాలువల వెంట రైతులు, స్థానిక గ్రామస్థుల ఆధ్వర్యంలో సాగు నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం ప్రకటించగానే వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగి అధ్యయనం చేశారు. లక్షమందితో కాళేశ్వరం జలానికి లక్ష జన హారతి అనుకున్నప్పటికి కార్యక్రమంలో లక్షా 16 వేల 142 మంది పాల్గొన్నట్లు నిర్దారించిన బృందం, అందులో 65 వేల 42 మంది మహిళలు, 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు వెల్లడించారు.
మండలాల వారిగా సూర్యాపేట 19881 వారిలో పురుషులు 8625 స్త్రీలు 11,256, చివ్వేంల స్త్రీలు 10,454, పురుషులు9785,పెన్ పహాడ్ స్త్రీలు 11935, 8125 పురుషులు, ఆత్మకూరు ఎస్ స్త్రీలు 10156, పురుషులు9521, జాజిరెడ్డి గూడెంలో స్త్రీలు 9985 పురుషులు 8152 మంది పాల్గొన్నట్లు అధికారిక ప్రకటన చేసారు. మంగళవారం సాయంత్రం నుండి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధుల బృందం పర్యటించారు. అనంతరం వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో సూర్యాపేట జిల్లా ఎక్కిందని ప్రకటించారు.ఈ కారణంగా వేదిక మీద మంత్రి జగదీష్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆ సంస్థ నిర్వాహకులు మెడల్ తో పాటూ మెమెంటో ప్రశంశా పత్రం అందజేశారు.