mt_logo

రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రానున్నాయి. కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో కాలేజీలు రాబోతున్నయి.  అతి త్వరలో  జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ కల సాకారం కానుంది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకొనుంది. 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది.

రాష్ట్రంలో పది వేలకు చేరువ కానున్న ఎంబీబీఎస్ సీట్లు, మారుమూల ప్రాంతాలకు సైతం చేరువైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు.. స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు పెరిగిన అవకాశాలు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇది ఒక వైద్య విద్య విప్లవమని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.