mt_logo

యశోదలో 45 రోజుల్లో 50 రోబోటిక్ సర్జరీలు

హైదరాబాద్‌: యశోద హాస్పిటల్స్‌ సర్జన్లు అరుదైన ఘనతను సాధించారు. కేవలం 45 రోజుల్లోనే 50 రోబోటిక్‌ సర్జరీలు విజయవంతంగా పూర్తిచేసినట్లు యశోద హాస్పిటల్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ Dr. పవన్‌ గోరుకంటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘనత సాధించిన సోమాజీగూడ యశోద హాస్పిటల్స్‌ సీనియర్‌ ఆర్థోపెడిక్‌ అండ్‌ రోబోటిక్‌ సర్జన్‌ Dr. సునీల్‌ దాచేపల్లిని, తన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు.ఈ సందర్బంగా సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మందికి పైగా రోగులు, వారి కుటుంబ సభ్యులు రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జరీలు చేయించుకున్న వారి అనుభవాలను పంచుకున్నారు.