mt_logo

తొలిరోజు 44,870 మంది రైతుల‌కు రుణ‌మాఫీ ల‌బ్ధి

రాష్ట్రంలో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ మొదలయింది. ఈ మేరకు చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ నుండి రూ.167.59 కోట్లు  విడుదల అయ్యాయి. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం నేడు రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి. దీనితో 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరింది.  ఈ  సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.