తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నాలుగు డిపార్ట్‌మెంట్లకు చెందిన నాలుగు నోటిఫికేషన్లను శనివారం విడుదల చేయనుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి వీటికి శుక్రవారం ఆమోదం తెలిపారు. హార్టికల్చర్, అగ్రికల్చర్, ఐ అండ్ క్యాడ్, హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మొత్తం ఖాళీలు 357 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు శనివారం నుండి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తులకు ఈనెల 25 చివరి తేదీగా నిర్ణయించారు.