అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొంటాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టం ఏర్పడిందని నిర్మల్ జిల్లాలో నష్టం తక్కువ జరిగిందని అన్నారు. తడిసిన ధాన్యం రేటు 2100 నుండి తగ్గుతూ రావడంతో ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా క్వింటాల్ కి 1962 రూపాయల చొప్పున 14% తేమ ఉన్నప్పటికీ తీసుకుంటామన్నారు. రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటదని తెలిపారు. వరికంటే మక్క పంట లాభసాటిగా ఉందని మొక్కజొన్న కోళ్ల పరిశ్రమకి, బిస్కెట్స్ కి ఉపయోగకారిగా ఉంటుందని, రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.