- Review by R Samala
ఈ మధ్య బుక్ రీడింగ్ కి ‘లాంగ్ బ్రేక్’ ఇద్దామనుకున్న నేను బుక్ ఫెయిర్లో ఉన్న మిత్రుడికి ఫోన్ చేసి మరీ పుస్తకం తెప్పించుకుని అర్థరాత్రి కూచుని ” చదవడానికి కారణం…
తెలుగుకథల్లో పాత్రలు ఫారిన్ వెళ్ళడమో, ఫారిన్లో తెలుగు కథ జరగడమో కథావస్తువు అయింది తప్ప ఇలా పూర్తిగా ఫారిన్ పాత్రలతో, ఫారిన్లోనే కథ మొత్తం జరగడం నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో (Subjected to Correction) ఇదే మొదటిసారి అవడం…
తెలుగు అనువాదసాహిత్యంలో దుమ్మురేపిన ‘దళారి పశ్చాత్తాపం’ రచయిత, ‘మిషన్ తెలంగాణ’ బ్లాగ్ తో ఎంతోమంది యువకుల్లో ‘తెలంగాణ సాధనాకాంక్ష’ రగిలించిన ఉద్యమకారుడు, నేను ఒక్కసారైనా కలవాలనే ‘బకెట్ లిస్ట్’లో ఉన్న వ్యక్తీ… దిలీప్ కొణతం అన్న దాదాపు పదేళ్ళ తర్వాత మళ్ళీ సాహితీయాత్ర చేపట్టిన పుస్తకం అవడం…
నాకు అత్యంత ఇష్టమైన మణిరత్నం ‘అంజలి’ తో పోల్చదగ్గ ‘లిప్తకాలపు స్వప్నం’ రచయిత స్వర్ణ కిలారి దీనికి కో-ఆథర్ అవడం…
దంపతులైన వీరిద్దరూ మొదటిసారి కలిసి ఒక పుస్తకం రాయడం…
ఇవేవీ కావు…!!!
ఏడు పుస్తకాలు, మూడు డాక్యుమెంటరీలు, రెండు సీరీస్లు, రెండు సినిమాలు (Ron Howard లాంటి మాస్టర్ డైరెక్టర్ సినిమా ఒకటి) – ఇంత ఇంటర్నేషనల్ కంటెంట్ వచ్చాక కూడా ఈ సబ్జెక్టు మీద తెలుగులో ఒక పుస్తకం రాయాలన్న వీళ్ళ ‘గట్స్’ ఏంటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదటి కారణం…
మూడు డాక్యుమెంటరీలు, రెండు సీరీస్లు, రెండు సినిమాలు చూసిన నాకు వీళ్ళిద్దరూ కొత్తగా ఇంకేం చెప్పలేరన్న నా నమ్మకం నిరూపించుకోవడం రెండో కారణం…
ఎప్పుడో 1975 లో వచ్చిన ‘అమరావతి కథల’ కి రెండుమూడు వందల ‘క్లోన్’ లని వదిలి ఇంకా అదే ట్రెండ్‌ని పట్టుకుని వేలాడుతూ నాలాంటి సీరియస్ పాఠకులకి చిరాకు కలిగిస్తున్నసాహిత్య సినేరియోలో ’13’ కథావస్తువు ‘One of Its Kind’ అవడం మూడో కారణం…
“13” Is a Pulse-pounding Page-turner.
శబ్దాడంబరం లేకుండా, సంక్లిశిష్ట పదజాలం వాడకుండా చాలా సరళంగా సూటిగా సాగిన రచన నన్ను థాయ్ లాండ్ “థామ్ లువాంగ్” గుహ ముందు ప్రేక్షకుణ్ణి చేసింది.
‘ఇటాలియన్ నియోరియలిజం’ టెక్నిక్ రైటింగ్ లో అప్లై చేశారేమో అన్నంత రియలిస్టిక్ గా ఉంది.
థ్రిల్లర్, డ్రామా, డాక్యుమెంటరీ, ఆక్షన్, ఫిక్షన్, బయోగ్రాఫికల్ ఎలిమెంట్ల మధ్య రైటర్స్ ఇద్దరూ చాకచక్యంగా కథను నడపిన విధానం చాలా బావుంది.
“13” is a Genre Bending, Multi-Genre Writing.
టీవీల్లో రెస్క్యూ ఆపరేషన్ చూసిన చాలామందికి ఓవరాల్ ఇష్యూ తెలుసుగానీ పాయింట్ టు పాయింట్, మినట్ టు మినట్ ఏం జరిగిందో తెలీదు. పిల్లలు గుహలోకి వెళ్ళిన మొదటిరోజు నుండి బయటకు వచ్చిన పద్దెనిమిదో రోజు వరకూ ప్రతీ అంశాన్ని, ప్రతీ సంఘటనను లాజికల్ గా చర్చించి క్రోనోలాజికల్ గా పొందుపరిచిన విధానం ఆశ్చర్యపోయేంత బావుంది. రచయితలు ఎంతో డీప్ రీసెర్చ్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు.
కొత్త ఇతివృత్తాలతో రాసేవాళ్ళని కొని చదవకపోతే వాళ్ళూ క్లోన్ల మేకింగ్ మొదలు పెడతారు. 13 కొని చదవాల్సిన పుస్తకం.
చిన్నచిన్న అభ్యంతరాలున్నా ఓవరాల్ గా 13 నాకు నచ్చింది.
బతుకే ఒక పోరాటమైపోయిన ఈ కాలంలో బతకడం కోసం 13 మంది పిల్లలు 18 రోజులపాటు చేసిన పోరాట విజయగాథ మన పిల్లలకు పోరాటస్పూర్తిని కలిగించే ఒక self help పుస్తకం. పిల్లలతో తప్పకుండా ఈ పుస్తకం చదివించాలి.
సందర్భోచిత బహుమానంగానో, బర్త్ డే గిఫ్ట్ గానో పిల్లలకు ఈ పుస్తకం ఇచ్చి చదివిస్తే బావుంటుంది. నేనూ చేస్తాను. చదివితే మీరూ తప్పకుండా చేస్తారు.