mt_logo

రైతులను ఆదుకునేందుకు డబ్బులు లేవా :మంత్రి గంగుల కమలాకర్

  • తెలంగాణ ప్రజలు, రైతులు దేశంలో బాగం కాదా?
  • మేం కట్టే జీఎస్టీ పన్నులు ఎంజాయ్ చేస్తారు, మా కష్టాల్లో ఎందుకు సహకరించరు
  • ప్రభుత్వంలో భాగస్వామి అయిన గవర్నర్ కు రైతుల కష్టాలు కనిపించడం లేదా
  • ఇప్పుడు రాజ్ భవన్, ప్రగతీ భవన్ దూరం కాదు, అపాయింట్ మెంట్ గాదలు కాదు, రైతుల వెతలు చూడండి
  • తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రధానికి గవర్నర్ గా లేఖ రాయండి
  • బాధ్యత గల కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు క్లిష్ట సమయంలో రైతులతో రాజకీయం ఆపండి

విపత్కర పరిస్థితుల్లో రైతుల కోసం కృషి చేస్తున్న రాష్ట్రానికి అండగా ఉండాల్సిన బాధ్యత లేదా? కేసీఆర్ గారు ఇస్తున్న నష్టపరిహారం 10వేలకు అధనంగా 20వేలను కేంద్రం నుండి ఇప్పించండి. తడిసిన ధాన్యం నుండి ఔటర్న్ శాతాన్ని 67 నుండి 50కి తగ్గించండి. తేమ శాతాన్ని 17 నుండి 20కి పైగా పెంచండి. ఎఫ్.సి.ఐ నిభందనల్ని సడలించడానికి మాతో కలిసి ఒత్తిడి తేండి. క్లిష్ట సమయంలో తెలంగాణ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి వారితో ఆడుకోకండి. తీవ్ర నష్టంతో సెన్సిటివ్గా ఉన్న రైతులను రెచ్చగొట్టడమేనా ప్రతిపక్షాల బాధ్యత. రైతులను ఆదుకోవడానికి రండి దగ్గరుండి నష్టాన్ని చూపిస్తాం.రైతుల పట్ల కేంద్ర పెద్దలు, గవర్నర్ తీరుపై విరుచుకుపడ్డ మంత్రి గంగుల కమలాకర్. కాలునొప్పి బాదిస్తున్నా రైతుల వ్యథలు చూసి తీవ్ర ఆవేదనతో మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్.

రాష్ట్ర ప్రజలు కట్టే జీఎస్టీ పన్నులతో కేంద్రం ఎంజాయ్.

రాష్ట్ర ప్రజలు కట్టే జీఎస్టీ పన్నులతో కేంద్రం ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇవాల అదే ప్రజలు, రైతులు కష్టాల్లో ఉంటే కేంద్రం సహకరించకపోవడం దారుణమన్నారు, తెలంగాణ ప్రజలు దేశంలో బాగం కాదా అని కేంద్రాన్ని, గవర్నర్ని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. ఈ విపత్కర పరిస్థితుల్లో గవర్నర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు చేయాల్సింది రాజకీయాలు కాదని రాష్ట్ర ప్రజలకు, రైతులకు మద్దతుగా ఉండాలని, రైతుల కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని హితవు ఫలికారు, ధాన్యం కొనుగోళ్లు నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ కార్పోరేషన్ ఆప్ ఇండియా నిభందనలు సడలించాలని డిమాండ్ చేసారు. అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు, నేడు కల్లాల్లో తడిసిన ధాన్యంతో 67 కిలోల ఔటర్న్ రాదని, రైతులకు అండగా ఉండడం కోసం దీన్ని 50 కిలోలకు తగ్గించాలని డిమాండ్ చేసారు మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో రైతుల పంట పొలాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి తీవ్ర స్వరంతో తన ఆవేదన వెలిబుచ్చారు. 

బీజేపీ ఎంపీలు వచ్చి రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు 

 తనకు కాలు నొప్పితో ఉన్నా రైతుల దయనీయ స్థితిని చూసి చలించి పంటనష్టపోయిన పొలాల్లో తిరుగుతున్నానని, ఈ సమయంలో రాజకీయాలు పక్కనపెట్టి అందరూ రైతు కోసం పనిచేయాలన్నారు. చేతికొచ్చిన పంట నేలపాలైందని, రైతుబిడ్డగా పంట నష్టాన్ని చూసిన తీవ్ర ఆవేదనతో కలత చెందుతున్నానన్న మంత్రి, ఇప్పటికైనా తీవ్ర నష్టంతో సెన్సిటివ్గా ఉన్న రైతుల వద్దకు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వచ్చి రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయాలు మాని వారికి నష్టనివారణ కోసం చిత్తశుద్దితో కేంద్ర ప్రభుత్వ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేసారు.

కేంద్ర ప్రభుత్వం నియమిస్తే గవర్నర్ రాష్ట్రానికి వచ్చారని, ఈ క్లిష్ట సమయంలో గవర్నర్ సైతం బాధ్యత తీసుకోవాలని, ఎఫ్.సి.ఐ అధికారులను పిలిచి కేంద్రంపై ఒత్తిడి పెంచి రైతుల్ని ఆదుకోవడంలో కలిసి రావాలన్నారు., అవసరమైతే కల్లాల వద్దకు రావాలని, తాము సైతం పరిస్థితులను వివరిస్తామన్నారు.ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి మొదలు గ్రామ స్థాయి ప్రతినిధుల వరకూ ప్రతీ ఒక్కరం రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నామని, అదే బాధ్యతను గవర్నర్ సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రతినిధులు తీసుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.

అధనంగా కేంద్రం మరో 20 వేలు ప్రకటించాలి 

తమకు రాజకీయాలు ముఖ్యం కాదని, తెలంగాణ రైతు ఇబ్బందులు తొలిగించమని ఎక్కని కొండ, తొక్కని బండ లేదన్నారు. ఈ సమయంలో రైతులకు అండగా రాష్ట్ర సర్కారుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.  కేసీఆర్ గారు రైతులకు అండగా నష్టపరిహారం పదివేలు ప్రకటించారని దానికి అధనంగా కేంద్రం మరో 20 వేలు ప్రకటించాలని, కేసీఆర్ తడిసిన ధాన్యం కొంటామన్నారు, మీరు నిబందనలు సడలించండి, రైస్ మిల్లర్లను, ఎఫ్.సి.ఐ అధికారులను పిలిచి ఔటర్న్ పై నిర్ణయం తీసుకోండి 67 కిలోల నుండి ఎంత తగ్గిస్తారో చెప్పండి అని కేంద్రాన్ని డిమాండ్ చేసారు. ఇప్పటికే కేసీఆర్ గారు తేమ శాతాన్ని 17 నుండి 20 శాతానికి పెంచారని దీనికి మీరు ఆమోదం చెప్పాలని డిమాండ్ చేసారు. 

రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో గవర్నర్ గారు ప్రభుత్వంలో బాగస్వామి అయి రాజకీయాలు మాట్లాడడం బాధాకరం అన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాజ్ భవన్ ప్రగతీభవన్ ఎంత దూరం, కేసీఆర్ గారు అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు అని అసందర్భ పిర్యాదులు ప్రధానికి చేయడం కాదని, నిజానికి తెలంగాణ రైతుల పక్షాణ గవర్నర్ ఉన్నారు అనుకుంటే అదే మోడీకి తెలంగాణ రైతాంగం అకాల వర్షాలతో జరుగుతున్న నష్టంపై, ఎప్.సి.ఐ నిబందనలను సవరించమని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అధనంగా కేంద్రం మరో 20వేలు ఇవ్వాలని ధరఖాస్తు ఇవ్వాల్సిన గవర్నర్ బాధ్యతను గుర్తు చేసారు మంత్రి గంగుల. తెలంగాణ రైతులు, ప్రజలు భారతదేశంలో బాగస్వాములు కారా అని ప్రశ్నించారు. 43లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రంలో రైతులను ఆదుకునేందుకు డబ్బులు లేవా లేక కేంద్ర పెద్దలకు మనసు లేదా అని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్.