బాన్సువాడ : బాన్సువాడ పురపాలక సంఘం పరిధి, బాన్సువాడ గ్రామీణ మండలం, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ బిల్లు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ మండలానికి చెందిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన సభాపతి పోచారం. బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల లబ్ధిదారులకు బాన్సువాడ లోని తన నివాసం వద్ద, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల లబ్ధిదారులకు తెలంగాణ తిరుమల దేవస్థానం – తిమ్మాపూర్ వద్ద స్పీకర్ గారు చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ RDO రాజాగౌడ్, DSP జగన్నాధ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు ఈ పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 రెండు పడక గదుల ఇండ్లు మంజూరయ్యాయి.ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వ సబ్సిడీ ఇళ్ళు ఇంత పెద్ద మొత్తంలో మంజూరు కావడం
దేశంలో మొదటిసారి.
లబ్ధిదారులందరికి ఇంటి బిల్లులు
ఇళ్ళను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు. 100 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళను మంజూరు చేస్తుంది. 11,000 ఇళ్ళలో కాంట్రాక్టర్ల ద్వారా 3000 ఇళ్ళు కట్టిస్తే మిగితా 8,000 ఇళ్ళను లబ్ధిదారులు స్వంతంగా కట్టుకున్నారు. విడతల వారిగా లబ్ధిదారులందరికి ఇంటి బిల్లులు వస్తున్నాయి. త్వరలోనే మూడు లక్షల రూపాయల ఇంటి పథకం అమలు లోకి వస్తుంది. నియోజకవర్గంలోని పేదలకు, అర్హులైన వారందరికీ ఇంటిని మంజూరు చేస్తాను. బాన్సువాడ మున్సిపాలిటీ, రూరల్ మండలానికి సంబంధించిన 75 మంది కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఈరోజు పంపిణీ చేస్తున్నాం. 2015 లో ప్రారంభించిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం మొదట రూ. 51,000 లతో ప్రారంభమై ఇప్పుడు 1,00116 లు ఇస్తున్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 లక్షల మందికి నగదు సహాయం అందించారు. ఇందుకు రూ. 10,000 కోట్లకు పైగా ఖర్చు అయింది.
బాన్సువాడ నియోజకవర్గంలో 15,000 మందికి రూ. 130 కోట్ల నగదు అందింది. ఇలాంటి మంచి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆడబిడ్డకు అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనమామ లాగా ఇస్తున్నారు.పేద కుటుంబాలు తక్కువ ఖర్చుతో వివాహాలు చేసుకోవడానికి బాన్సువాడ నియోజకవర్గంలో రూ. 50 కోట్లతో 80 జనరల్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నాం. వీటిలో రోజుకి కిరాయి కేవలం రూ.5,000 మాత్రమే. ప్రజలు ఉపయోగించుకోవాలి.