mt_logo

నేడు మంచిర్యాల జిల్లా అభివృద్ధికై  సీఎం కేసీఆర్‌ పర్యటన

హైదరాబాద్, జూన్ 9: సీఎం కేసీఆర్‌ నేడు మంచిర్యాలలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలను ప్రారంభించనున్న ఆయన మొదట మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకొని 5 :10 గంటలకు ఆ భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత 5:30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకొని, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 6:25 గంటలకు కలెక్టరేట్‌ నుంచి బయలుదేరి 6:30 గంటలకు నస్పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలియజేసారు.