mt_logo

నయా రాజకీయ ఊసరవెల్లి ఈ నాగబాబా!

లోక్ సత్తా అట్లాంటి ఇట్లాంటి పార్టీ కాదు, జయ ప్రకాష్ నారాయణ సాక్షాత్తూ ఈ దేశాన్ని ఉద్ధరించడానికి అవతరించిన కల్కి భగవానుడితో సమానం అని కొందరు నమ్ముతారు.

నాగభైరవ జయప్రకాష్ నారాయణ కూడా చంకలో రాజ్యాంగాన్ని ఒక మత గ్రంధంలా పెట్టుకుని, అనేక వేదికల మీద (సందర్భం ఉన్నా లేకపోయినా) తాను చదివిన ఆంగ్ల పుస్తకాల్లోంచి కొటేషన్లను ధారాళంగా ఉటంకిస్తూ, తన రాజకీయ బాబా అవతరాన్ని రక్తి కట్టిస్తుంటారు.

ఆధ్యాత్మిక భోదనల పేరుతో జనాలను మోసం చేసే బాబాల గుట్టు ఎన్నిసార్లు రట్టయినా సదరు బాబాల భక్తులు గొర్రెల్లా ఆయా బాబాలను నమ్ముతూనే ఉంటారు.

నాగభైరవ బాబా భక్తులదీ అదే వరుస. ఆయన ఎంత అడ్డగోలుగా మాట్లాడినా, ఎన్నిసార్లు మాట మార్చి, తాను ప్రవచించే విలువలను పాతరేసినా ఆయన మాటే వేదం ఈ భక్త బృందానికి.

నిన్న రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీపెట్టిన అవిశ్వాసంపై ప్రసంగిస్తూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ నాగభైరవుడు ఆకాశానికి ఎత్తేశాడు. అంతటితో ఊరుకోకుండా తాను ఓటింగులో పాల్గొననని, తటస్థంగా ఉంటానని చెప్పాడు.

రెండు రోజుల కిందే ఈయన, ఈయన పార్టీ, అవిశ్వాసానికి మద్ధతు ఇస్తామని చెప్పిన మాట ఆయన పార్టీ పత్రిక ఇలా ఘనంగా అచ్చేసుకుంది చూసి తరించండి:

వోటు వజ్రాయుధమని రోజు అరిగిపోయిన రికార్డు వేసే లోక్ సత్తా నేత, నిన్న ఆ వజ్రాయుధాన్ని ఎందుకు వాడలేదో ఇప్పుడు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి.

ప్రతిపక్ష, స్వంత పార్టీ ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా శాసనసభ లాబీల్లో టోకున బేరసారాలు జరుపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని నిర్లజ్జగా స్తుతించడానికి ఎంత ముట్టిందో ఇప్పుడు బహిర్గతం చేయాలి.

ఇప్పుడున్న రాజకీయ పార్టీలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే నాగభైరవుడు ఇలా తెల్లారేసరికి ప్లేటు ఫిరాయించడం ఏ విలువ?

ఇదే పని వేరే పార్టీ ఎమ్మెల్యేలు చేస్తే అమ్ముడుపోయారని దుమ్మెత్తిపోసేవారు ఇదే లోక్ సత్తా పార్టీ వారు. మరిప్పుడేం అంటారో?

(మాకు తెలుసు ఇది చదివాక కూడా నాగ బాబాను ఆయన భక్తులు స్తుతిస్తూనే ఉంటారు. బాబాగారు ఊరికే ఏమీ చేయరు, ప్రతి పని వెనుకా ఏదో నిగూఢ కారణం ఉండే ఉంటుంది అని దబాయిస్తారు చూడండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *