mt_logo

గీత కార్మికుల కోసం భీమాను ప్రవేశపెట్టినందుకు సీఎం కు కృతజ్ఞతలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తి కి పూర్వ వైభవం.

తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నాం.

రాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైన్ షాపులలో దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా గౌడ సామాజిక వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు.

రైతు బీమా మాదిరిగా 5 లక్షల రూపాయల ‘గీత కార్మికుల కోసం భీమా’ను ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్

గీత వృత్తి ప్రోత్సాహం కోసం తెలంగాణకు హరితహారంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల 20 లక్షల తాటి, ఈత మొక్కలు నాటం

తాటి , ఈత చెట్ల రెంటల్ శాశ్వతంగా రద్దు చేశాం. గీత కార్మికుల గత బకాయిలను శాశ్వతంగా రద్దు చేశాం. గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ను 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ప్రమాదవశాత్తు తాటిచెట్టు నుండి పడి చనిపోయిన శాశ్వత అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ను అందించాం. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసిని ప్రవేశపెట్టాం . తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తిదారులు మాత్రమే నీరాను ఉత్పత్తి, అమ్మకాలు జరిపేలా నీరాపాలసిని రూపొందించాం. హైదరాబాద్ నగరంలో ఎంతో విలువైన నెక్లెస్ రోడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ కేఫ్’ ను రేపు ప్రారంభించబోతున్నాం . వందల కోట్ల విలువైన గౌడ ఆత్మగౌరవ భవనానికి 5 ఎకరాల భూమి కేటాయింపు. సాంప్రదాయ పద్ధతిలో తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికులు వందల ఏళ్ల నుంచి వేలాది మంది గీత కార్మికులు మరణించారు, శాశ్వత అంగ వైకల్యం చెందారు . గీత కార్మికులు ఎంతో సాహసోపేతంగా గీత వృత్తిని కొనసాగిస్తున్నారు. గీత వృత్తిలో ప్రమాదవశాత్తు జరిగే మరణాలను నివారించేందుకు అధునాతన తాటి చెట్టు ఎక్కే యంత్రాల రూపకల్పన కోసం కృషి చేస్తున్నాం. గీత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో గీత కార్మికుల కోసం రైతు బీమా తరహాలో ‘గీత కార్మికుల భీమా’ ను ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి గీత కార్మికుల పక్షాన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు .