mt_logo

ఐటీ కారిడార్‌ను  ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌: దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. 8 కంపెనీల ప్రతినిధులతో  ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. తర్వాత సుమారు 270 ఎకరాల్లో నిర్మించనున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్‌ పనులకు శంకుస్థాపన చేసి శిల్పారామాన్ని ప్రారంభిస్తారు.