వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ శివారులో ఉన్న అలెన్ మాల్‌లోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి దుండగుల తూటాలకు బలైంది. ఆమె మొహం ఛిద్రమయ్యేలా తూటాల వర్షం కురిపించాడు. అందువల్లనే ఐశ్వర్య మొహం గుర్తు పట్టరాకుండా అయ్యింది. చివరకు మృతదేహాన్ని ఫింగర్ ప్రింట్స్ ద్వారా గుర్తించగలిగారు. ఐశ్వర్యతో పాటుగా ఈ కాల్పుల్లో 8 మంది చనిపోయారు. ఐశ్వర్య పర్ ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె తండ్రి పేరు నర్సిరెడ్డి. రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. కూతురు మరణవార్త తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు.