mt_logo

ఉద్యమంపై పచ్చ పత్రికల పిచ్చి ప్రేలాపణలు

By: సవాల్ రెడ్డి

తెలంగాణ ఉద్యమం పుట్టినప్పటినుంచి పత్రికల్లో వ్యతిరేక వార్తలతో ఆనందించడం ఆంధ్రపత్రికలకు ఆనందంగా ఉంటూ వస్తున్నది. ఏ ఒక్కటీ నిజం కాకపోయినా…పదే పదే అదే అదే రాయడం వాటి పైశాచికానందం……అదో తుత్తి!

ఉద్యమాన్ని ఎదుర్కోవడం చాతకాదు… ఉద్యమించడం చాతకాదు….నపుంసకుడు ఇతరులను శిఖండులు అయిపోయినట్టు కలగని ఆనందిస్తాడట…ఇదీ ఆంధ్రపత్రికల వైఖరి.

ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో ఓ వార్త వండారు. టీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనమవుతున్నదని…. అయ్యందా? టీఆర్ఎస్లో చేరదలుచుకున్న టీడీపీ నాయకులను ఆపవచ్చుననే తప్ప అందులో నిజం ఉన్నదా?
జనవరి లో కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వబోవడం లేదని ప్రకటిస్తుందని ఓ ఇంగ్లీషు పత్రికలో రాశారు. నిజమైందా? మొన్నామధ్య టీ కాంగ్రెస్ నేతలు పార్టీ పెడుతున్నారన్నారు. ఏమైంది? ఆంధ్ర పత్రికలు తెలంగాణ మీద రాసే ప్రతి కథా ఇంతే.

తెలంగాణకు మండలి ఖాయం అని దాదాపు అన్ని పత్రికల వారూ అన్నారు. రెండువేల కోట్లు అన్నారు……ఏమైంది?
కృష్ణ కమిటీ నివేదిక సమయంలో హైదరాబాద్ యుటీ గ్యారెంటీ అన్నారు. రాజ్యాంగ రక్షణలు అన్నారు. ఏమయ్యాయి అవన్నీ? ఏవీ నిజం కాకపోయినా కనీసం సిగ్గుపడకపోవడం వాటి ప్రత్యేకత……
వాడెవడో రాశాడు…..రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేందకు హోంశాఖ నివేదికల మీద ఆధారపడతాడని… వాటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడని….
నిర్ణయాలను హోంశాఖ నివేదికల ఆధారంగా తీసుకుంటే ప్రధాని ఎందుకు కేబినెట్ ఎందుకు? గోలీలాడుకోవడానికా….? పాలన హోంశాఖకూ అప్పగిస్తే సరిపోదా?

ఇక హోం నివేదికలు…

నాలుగు దశాబ్దాల క్రితం అనుకుంటా…. ఝార్ఖండ్ ఉద్యమం మొదట ప్రారంభించింది….బిర్సాముండా(?) అప్పట్లో ఆందోళనలో కొంత హింస చోటు చేసుకుంది. హోం శాఖ నివేదిక అది ఉగ్రవాద ఉద్యమమని….చైనా ఆయుధాలు ఇస్తోందని కేబినెట్ చర్చల్లో నవ్వుకున్నారు.. ఎందుకంటే ఉద్యమం బహిరంగంగా ప్రజల్లో జరుగుతోంది… ఉద్యమకారుల చేతుల్లో ఉన్నవి విల్లు బాణాలు…. ఇవీ చైనానుంచి వచ్చాయా అని చెత్తబుట్టలో పడేశారు ఆ నివేదికను……

కాశ్మీర్ సమస్య విషయంలో హోం నివేదిక ఆధారంగా నిర్ణయాలే తీసుకోవాల్సి ఉంటే ఈ పాటికి పాకిస్థాన్ తో పదిసార్లైనా యుద్ధాలు చేయవల్సి వచ్చేది……

కానీ ఏనాడు వాటి ఆధారంగా కాక రాజకీయ పరంగానే ప్రతినిర్ణయమూ తీసుకున్నారు….

పాలన మీద….. జాతీయ సమస్యలనను కేంద్రం టాకిల్ చేసే పద్దతుల మీద కనీస అవగాహన లేని అంగుష్ట మాత్రులు రాస్తున్న ‘కమ్మ’ని కథలకు మనం బెదిరిపోవాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…..

తెలంగాణ లో ముఖ్యంగా కరీంనగర్ లో ఒక సామెత చెబుతారు….”గులుగుడుగొట్టోడు ఇల్లు కడితే పచ్చి ఆరకముందే ఇచ్చేసుకున్నాడని”……

అలా వీళ్లు ఇలా గొనుగుతునే ఉంటారు….ఉండనియ్యండి!

ఇంతగా……అంతా కలిసి కట్టుగా ఏడుస్తున్నారంటే…..

అది…..ఏదో శుభం తెలంగాణకు జరగనుందనే అర్థం.!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *