mt_logo

నాడు చుక్కనీరులేని తెలంగాణ‌.. తొమ్మిదేండ్ల‌లో జ‌ల‌స‌వ్వ‌డుల మాగాణా

  • కాళేశ్వ‌రంతో మ‌న భూముల‌కు న‌దుల‌ ప‌రుగులు
  • వాగుల పునరుజ్జీవంతో సాగునీటి గ‌ల‌గ‌ల‌లు
  • మిష‌న్ కాక‌తీయ‌తో పెరిగిన జ‌ల‌వ‌నరులు

నాడు గోదారి తల్లి వ‌ట్టిపోయి వ‌ల‌వ‌లా ఏడ్చింది..
నేడు ఆ గోదార‌మ్మే ఎదురెక్కి మ‌న చేల‌ను త‌డిపింది
నాడు కృష్ణమ్మ చూద్దామ‌న్నా కండ్లకే కానరాలె..
నేడు పంట‌ల‌కు మ‌ళ్లి క‌ర్ష‌కుల క‌న్నీళ్లు తుడిచె
నాడు ఎటుచూసినా ఎండిన‌ చెరువులు, వాగులు
నేడు వేసవిలోనూ మత్తళ్లు దుంకే జ‌ల‌వ‌న‌రులు
కాళేశ్వరంతో భూతల్లి తాన‌మాడింది..
పంటలతో తెలంగాణ పల్లె మెరిసి మురిసింది..
ఇది మ‌న తెలంగాణ సాగునీటి విప్ల‌వం
మ‌న తెలంగాణ సాధించిన హ‌రిత విప్ల‌వం
కేసీఆర్ చేసిన 9 ఏండ్ల మ‌హా అద్భుతం!!

హైదరాబాద్‌:  తెలంగాణ స్వ‌రాష్ట్రంలో మండుటెండ‌ల్లోనూ మ‌త్త‌డులు..చెరువుల్లో ఎగిరి దుంకుతున్న చేప‌లు..చివ‌రి ఆయ‌క‌ట్టుకూ సాగునీళ్లు..వ‌ర్షాల కోసం ఎదురుచూడ‌కుండా మూడు పంట‌ల‌నూ త‌డుపుతున్న గోదారి, కృష్ణ‌మ్మ‌..సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో  కేవ‌లం 9 ఏండ్లలోనే తెలంగాణ జల మాగాణం అయ్యింది. సీఎం కేసీఆర్‌ కార్యదక్షత, దూరదృష్టి. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌, రీ డిజైన్‌తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. పాతాళ గంగమ్మ పైపైకి ఎగిసి వస్తుంది.

తెలంగాణ జలవిజయంలో సీఎం మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుది కీలక భూమిక. రికార్డు సమయంలో భారీ ప్రాజెక్టును పూర్తిచేయడం ఒక విశేషమైతే, దాని ఫలాలు తెలంగాణ అంతటికీ అందించటం మరో విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016 మే 2న శంకుస్థాపన చేయగా, మూడేండ్లలోనే పూర్తి చేసి 2019 జూన్‌ 21న సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అప్పటి వరకు గోదావరి నుంచి 90 టీఎంసీలను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేని దుస్థితి. నేడు గరిష్ఠంగా 400 టీఎంసీలకు పైగా వినియోగించుకునే స్థాయికి ఎదిగామంటే సాధించిన ప్రగతి ఎంతో అర్థం చేసుకోవచ్చు.

చ‌క‌చ‌కా ప్రాజెక్టులు.. పొలాల‌కు న‌దుల‌ ప‌రుగులు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా కాకతీయ కాల్వ చిట్ట చివరి భూముల వరకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి. మరోవైపు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను సైతం ప్రాధాన్య క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేస్తున్నది. పాలమూరు జిల్లాను తీసుకుంటే ఇక్కడ ఏకంగా 4 ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో 8 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. కోయిల్‌సాగర్‌ ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.65 లక్షల ఎకరాలకు జీవం వచ్చింది. రాజీవ్‌ భీమా ద్వారా 2.03 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారానే ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా బీడు భూములకు జీవం వచ్చింది. ఇక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని అద్దుతున్నది. ప్రాజెక్టు నిర్వహణకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ యాప్‌లను వస్సార్‌ ల్యాబ్స్‌ ఇప్పటికే రూపొందించింది. పంప్‌హౌజ్‌లు, జలాశయాలు, కాలువలు, చెరువులు, వర్షపాతం వివరాలు, నదుల ఇన్‌ఫ్లో, భూగర్భ జలాల పరిస్థితి తదితర సమస్త సమాచారం అంతా ఒకే చోట లభ్యం కానున్నది. నదుల్లోకి వచ్చే, కిందికి విడుదల చేసే నీటి పరిమాణాన్ని అంచనా వేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో పొందుపరిచారు. జలాశయాలు, చెరువుల్లో ఎంత నీరు ఉన్నది? ఎంత ఖాళీ ఉన్నది అన్న సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలగనున్నది.

మిషన్‌కాకతీయతో 46,531 చెరువులకు మ‌హ‌ర్ద‌శ‌

మిషన్‌కాకతీయతో 46,531 చెరువులను దశలవారీగా పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే 4 దశల్లో 27,627 చెరువులకు జీవం పోసింది. మొత్తంగా 15.05 లక్షల ఆయకట్టును స్థిరీకరించారు. కొత్తగా 1.05 లక్షల ఎకరాలు సాగు కిందికి వచ్చాయి. ఇక చెరువుల్లోనే 9.61 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలని సంకల్పించిన ప్రభుత్వం.. సుమారు 1,200 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించింది. వాగుల పునరుజ్జీవ పథకం కింద కృష్ణ బేసిన్‌లోని వాగులపై 188, గోదావరి బేసిన్‌లో వాగులపై 444 చెక్‌డ్యామ్‌లను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే చాలా చోట్ల వేగవంతంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

మిషన్‌కాకతీయ

మొత్తం చెరువులు: 46,531

పునరుద్ధరించినవి: 27,627

ఖర్చు : రూ.9,155.97 కోట్లు

తొలగించిన పూడిక : 2,384.35 లక్షల క్యూబిక్‌ మీటర్లు

పునరుద్ధరించిన నీటి నిల్వ సామర్థ్యం: 9.61 టీఎంసీలు

ఆయకట్టు స్థిరీకరణ : 15.05 లక్షల ఎకరాలు

చెరువుల కింద కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు 1.05 లక్షల ఎకరాలు

165 చిన్న నీటి ఎత్తిపోతల పథకాల కింద కొత్తగా 1.23 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం

తెలంగాణ సాగునీటి చరిత్ర

-2004-14 వరకు పదేండ్లలో తెలంగాణ ప్రాజెక్టులపై ఉమ్మడి సర్కారు పెట్టిన ఖర్చు : రూ.38,405.2 కోట్లు

-2014-23 వరకు 9 ఏండ్లలో ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు వెచ్చించిన మొత్తం: రూ.1.69 లక్షల కోట్లు

-75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణ శాతం 7.7%

-9 ఏండ్లలో తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణ శాతం 117%

-9 ఏండ్లలో పెరిగిన సగటు భూగర్భ జల మట్టం : 4.14 మీటర్లు

ఏడేండ్లలో తెలంగాణ సర్కారు పూర్తి చేసిన పెండింగ్‌ ప్రాజెక్టులు

కల్వకుర్తి, రాజీవ్‌ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, మిడ్‌మానేర్‌, సింగూరు కెనాల్స్‌, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెంవాగు, కుమ్రంభీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథపూర్‌

తెలంగాణ ఏర్పాటు తరువాత మొదలుపెట్టి పూర్తిచేసిన ప్రాజెక్టులు

కాళేశ్వరం, చనాకా కొరాట బరాజ్‌, సమ్మక్కసారక్క బరాజ్‌, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం

వాగుల పునరుజ్జీవ పథకం

-నిర్మించాల్సిన చెక్‌డ్యామ్‌లు మొత్తం 1,210 

-మొదటి విడత-635 (రూ.1,975 కోట్లు) పనులు తుది దశకు చేరుకున్నాయి.

-400 చెక్‌డ్యామ్‌లు పూర్తయ్యాయి.

-మిగతావి 80 శాతం పూర్తయ్యాయి.

-సెకండ్‌ ఫేజ్‌ 585 (రూ.1,850 కోట్లు)పనుల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.

నీటి పారుదల సంభావ్యత

సంవత్సరం :ఎకరాలు

2014-15 :23.44 లక్షలు

2015-16 :26.68 లక్షలు

2016-17 :46.63లక్షలు

2017-18 :49.86లక్షలు

2018-19 :51.85లక్షలు

2019-20 :70.54లక్షలు

2020-21 :91.24లక్షలు

2021-22 :97.16 లక్షలు

2022-23: 1.03 కోట్లు