మెదక్ ఎంపీ గా పోటీ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 3,97,029 ఓట్ల భారీ మెజారిటీతో రికార్డు నెలకొల్పారు. మరోవైపు వరంగల్ ఎంపీగా పోటీ చేసిన కడియం శ్రీహరి 3లక్షల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఎంపీ రాజయ్యపై గెలిచారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్ కుమార్, ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్ టీడీపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై గెలుపొందారు.
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వివేక్ పై 2,10,000ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత 1,80,000 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ను మట్టికరిపించారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ విజయం సాధించారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపొందారు. చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 60,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.