దేశ రాజధాని ఢిల్లీలో ఆరురోజులపాటు రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహిస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై అధికారులతో జితేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 18 నుండి 20 గంటలు కష్ట పడుతున్నారని, బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్ పునాదులు వేస్తున్నారని అన్నారు.
మొదటి ఏడాది విజయవంతంగా ముగించుకోబోతున్నామని, రెండో సంవత్సరం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఎంపీ పేర్కొన్నారు. తెలంగాణ ఆటలు, పాటలతో చరిత్రను చాటేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఢిల్లీ ప్రజలకు సైతం తెలంగాణ వంటకాలను రుచి చూపించాలని నిర్ణయం తీసుకున్నామని జితేందర్ రెడ్డి తెలిపారు.