mt_logo

కేసీఆర్ విజ‌న్‌తో అన‌తికాలంలోనే ఆర్థిక శ‌క్తిగా తెలంగాణ‌.. ఏటా పెరుగుతున్న ఆదాయం.. ఇది కాగ్ చెప్పిన నిజం

  • ఈ ఏడాది త్రైమాసికంలో రూ. 50,910 కోట్ల ఆదాయంతో రికార్డు

తెలంగాణ దేశంలోనే అతి త‌క్కువ వ‌య‌సున్న చిన్న రాష్ట్రం. అయినా.. ఆదాయంలో పెద్ద రాష్ట్రాల‌ను అధిగ‌మించి దూసుకుపోతున్న‌ది. సీఎం కేసీఆర్ ప‌టిష్ట‌ ఆర్థిక ప్ర‌ణాళిక‌తో వ‌డివ‌డిగా అడుగుల వేస్తున్న‌ది. ఏటికేడు రాష్ట్ర ఆదాయం పెరుగుతూ పోతూ ఉన్న‌ది. అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదుగుతున్నది. సీఎం కేసీఆర్ వినూత్న సంస్క‌ర‌ణ‌ల‌తో ఉద్య‌మ నినాదాలు ఒక్కొక్క‌టీ నెర‌వేరుతున్నాయి. ఇందుకు కాగ్ చెప్పిన లెక్క‌లే ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి. ఈ ఏడాది అంటే 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో వివిధ రూపాల్లో తెలంగాణ‌కు రూ. 2,59,861 కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని రాష్ట్ర స‌ర్కారు బ‌డ్జెట్‌లో అంచ‌నా వేసింది. అయితే, ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల్లోనే.. మొద‌టి త్రైమాసికంలోనే అన్నీ క‌లిపి మొత్తం రూ.50, 910 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖ‌జానాకు స‌మ‌కూరింది. కేవ‌లం మూడు నెల‌ల్లోనే బ‌డ్జెట్ అంచ‌నాల్లో 20 శాతం ఆదాయం వ‌చ్చింది. గ‌త ఏడాది వ‌ర‌కూ ఇదే స‌మ‌యానికి రూ.43,550.51 కోట్ల ఆదాయం వ‌చ్చింది. అంటే బ‌డ్జెట్ అంచ‌నాల్లో18 శాతం వ‌చ్చింది. గ‌తేడాదితో పోలిస్తే ఈ సారి రూ.7,359.6 కోట్లు అధిక ఆదాయం సమకూరిన‌ట్టు కాగ్ మొద‌టి త్రైమాసిక నివేదిక‌లో వెల్ల‌డైంది.

జీఎస్టీ ఆదాయమే అధికం
తెలంగాణ‌కు మొద‌టి త్రైమాసికంలో వ‌చ్చిన ఆదాయంలో జీఎస్టీ రాబ‌డే అధికంగా ఉన్న‌ది. ఈ ఏడాది జీఎస్టీ రూపంలో రూ.50,942 కోట్ల రాబ‌డి వ‌స్తుంద‌ని రాష్ట్ర స‌ర్కారు అంచ‌నా వేయ‌గా.. మూడు నెల‌ల్లోనే రూ.11,418 కోట్లు వ‌సూల‌య్యాయి. అంటే బ‌డ్జెట్ అంచ‌నాల్లో 22 శాతం వ‌సూల‌య్యాయి. గ‌తేడాదితో పోలిస్తే రూ. 1,773 కోట్ల ఆదాయం ఎక్కువ‌గా స‌మ‌కూరింది. రాబడిలో ఎక్కువ మొత్తం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే తెలంగాణ స‌ర్కారు ఖ‌ర్చు చేస్తున్న‌ది. పటిష్ట ప్రణాళికతో ఏటికేడు ఆర్థిక వనరులను పెంచుకొంటున్నది.

రాష్ట్రానికి వ‌చ్చిన వివిధ రకాల ఆదాయాలు
– స్టాంపులు, రిజిస్ట్రేషన్లు రూ. 3,510.63 కోట్లు
– అమ్మకం పన్ను రూ.7,532.96 కోట్లు
– కేంద్ర పన్నుల వాటా రూ.2,988.88 కోట్
– పన్నేతర రాబడి రూ.1,488.10 కోట్లు