వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జాను ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ విభాగంలో తొలిసారి టైటిల్ గెలిచిన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా ఇప్పటికే మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కైవసం చేసుకున్నారని ముఖ్యమంత్రి గుర్తుచేసారు. హైదరాబాద్ అమ్మాయిలు అంతర్జాతీయ పోటీలలో రాణించి అందరికీ, ముఖ్యంగా ఆడపిల్లలకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.