ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన మెట్రో లగ్జరీ బస్(వోల్వో) ను గురువారం కోఠిలోని బస్ టర్మినల్ నుండి ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ జయారావు చెప్పారు.
బస్సును ప్రారంభించిన అనంతరం జయారావు విలేకరులతో మాట్లాడుతూ, నగరంలో ఈ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయని, బస్ లో కంప్యూటర్ మానిటర్ కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాలు, ఏసీ, వికలాంగులు తమ వాహనంతో సహా బస్ లోకి ఎక్కేందుకు అనువుగా ర్యాంప్, అత్యంత ఆధునికమైన సస్పెన్షన్లు, సౌకర్యవంతమైన సీట్లు, ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు సంకేతం ఇచ్చే టెక్నాలజీ ఉన్నట్లు తెలిపారు.