తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిన ఈ కీలక సమయంలో, ఆ ప్రక్రియను ఆపడానికి సీమాంధ్ర బేహారులు కొత్త కుట్రకు తెరలేపారు. ఏకంగా ఉద్యమ రధసారధి కేసీఆర్ నే అంతమొందించేందుకు కుట్ర జరుగుతుంది.
కేసీఆర్ ను హత్య చేయడానికి కిరాయి హంతకులకు సుపారీ ముట్టజెప్పేందుకు సీమాంధ్ర దోపిడీశక్తులు ప్రయత్నిస్తున్న విషయం ఇప్పుడు బట్టబయలయ్యింది. ఈ మేరకు టీఆరెస్ నాయకులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు తెలంగాణ భవన్ లో జరిగిన ఒక మీడియా సమావేశంలో హరీష్ రావు, ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఈ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ ఐజీని కలిసి మూడు రోజుల క్రితమే ఇచ్చామని, తెలంగాణ ఉద్యమ నాయకుడీకి ఏమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు.
కేసీఆర్ కు వెంటనే జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని, ఆయన హత్యకు కుట్ర చేస్తున్నవారిని వెంటనే అరెస్ట్ చేయాలని హరీష్ రావు, ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.