mt_logo

కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. వచ్చిన కార్యకర్తలను, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ.. కేసీఆర్ వారికి ప్రత్యేక సమయాన్ని కేటాయించారు.

ఈ సందర్భంగా.. బుధవారం నాడు జనసందోహంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి.. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు మారు మోగాయి. కేసీఆర్ నివాసం అభిమానుల తాకిడితో కిక్కిరిసి పోయింది.

కార్యకర్తలతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లు తదితర ముఖ్యనేతలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కేసీఆర్‌తో నిత్యం సమావేశమవుతున్నారు.

ఈ సందర్భంగా బుధవారం పలు నియోజకవర్గాల నుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులతో వారి అభ్యర్థన మేరకు కేసీఆర్  ఫోటోలు దిగారు.

తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి నడుమ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాదాపు ఐదు గంటల పాటు ఓపికతో కేసీఆర్ సమయం కేటాయించారు.

కేసీఆర్‌ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమైన వారిలో…సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జమగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్య నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి గౌడ్, మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజినీ సాయిచంద్, ముఖ్యనేతలు, జిల్లాల స్థానిక నాయకులు ఉన్నారు.