రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కీ. శే. కాళోజీ నారాయణ రావు గారి 107 వ జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవ ఉత్సవాలలో రాష్ట్ర మంత్రులు శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, శ్రీ. తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ గార్లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాకవి డా కాళోజీ నారాయణ రావు గారి అవార్డు ను ప్రముఖ కవి డా. పెన్నా శివరామ కృష్ణ గారికి మంత్రులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో MLC గోరేటి వెంకన్న, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు డా. KV రమణ చారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి K S శ్రీనివాస రాజు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. ఆయాచితం శ్రీధర్, బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.