mt_logo

కాంగ్రెస్ పాలనలో.. అన్నదాత ఆగమైండు.. చేనేత కార్మికుడు చితికిపోతుండు: కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు పడుతున్న బాధలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కపట కాంగ్రెస్ పాలనలో.. కడుపునింపే అన్నదాత ఆగమైండు.. చేనేత కార్మికుడు చితికిపోతుండు అని పేర్కొన్నారు.

ప్రభుత్వ వైఫల్యం వల్ల.. పాలకుడి నిర్వాకం వల్ల.. ప్రతి నేతన్న నడిరోడ్డు మీద పడ్డడు..నాడు తెలంగాణ ఒక అవకాశాల గని.. చేనేత కార్మికుడికి చేతినిండా పని.. కానీ నేడు చేతకాని కాంగ్రెస్ పాలనలో కార్మికుల పాలిట శనిలా మారింది అని విమర్శించారు.

బతుకమ్మ చీరల ఆర్డర్లకు అడ్రస్ లేదు.. ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు మోక్షం లేదు.. అసమర్థ పాలనలో దిక్కుతోచని నేతన్నకు చేసేందుకు పనిలేదు.. తినేందుకు తిండి లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ తెచ్చిన.. సబ్సిడీ పథకాన్ని రాగానే సమాధి చేశారు. చేనేత మిత్ర పథకానికి నిలువునా పాతరేశారు. ఇలా ఇంకెంతకాలం అన్యాయాల జాతర చేస్తారు ఆని కేటీఆర్ ప్రశ్నించారు.

ఢిల్లీలోని బడే-భాయ్ జీఎస్టీ దెబ్బకు ఈ రంగం కుదేలైంది. గల్లీలోని ఛోటే-భాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైంది.అందుకే.. మూలనపడ్డ మగ్గం సాక్షిగా హెచ్చరిక.. చేనేత కార్మికులను చిన్నచూపు చూస్తున్న..
భస్మాసుర హస్తానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు అని అన్నారు.