mt_logo

రైతులకు లీగల్ నోటీసులా..? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం

పంట రుణాల విషయంలో రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

రుణమాఫీ విషయంలో ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం అని రేవంత్   అన్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు లోన్‌ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు అన్న రేవంత్ మాటలను ప్రజలకు గుర్తు చేశారు.

అదే కాంగ్రెస్ నేడు పంట రుణాలపై మౌనం వహిస్తున్నది.. రైతన్నలకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ఇది మోసం, పచ్చి దగా, నయవంచన అని దుయ్యబట్టారు.